A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రిగోల్డ్ -కొత్త ప్రభుత్వం వస్తేనే పరిష్కారమేమో
Share |
November 16 2018, 9:14 pm

ఎపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు దారి తీస్తోంది. ముప్పై లక్షల మందికిపైగా డిపాజిటర్ల ను మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ ఎందుకు సడన్ గా తగ్గిపోతుందన్నది అర్దం కాకుండా ఉంది. అంతేకాదు..మధ్యలో పెద్ద దళారీగా పేరొందిన అమర్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అవడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు.గతంలో అగ్రిగోల్డ్ ఆస్తులన్నిటిని స్వాధీనం చేసుకుని,డిపాజిట్ దారులకు పూర్తిగా డబ్బు చెల్లిస్తామని ముందుకు వచ్చిన సుభాష్ చందర్ పౌండేషన్ ఆ సంస్థ ఆస్తుల విలువను ఎందుకు తగ్గించింది? వాటిని స్వాదీనం చేసుకోవడానికి ఎందుకు వెనుకాడతోంది.పైగా ఎపి ప్రబుత్వంతో అమర్ సింగ్ చర్చలు జరుపుతున్నారని చెప్పడం ఏమిటో తెలియదు. ప్రభుత్వంతో కలిసి అగ్రిగోల్డ్ భూములను అబివృద్ది చేస్తామని ఎందుకు ప్రతిపాదించారు?ఇదంతా చూస్తుంటే ఈ డీల్ లో ఏదో గోల్ మాల్ జరుగుతోందన్న అనుమానం కలుగుతుంది. ఇన్ని ఏళ్లుగా అగ్రిగోల్డ్ సమస్య పెండింగులో ఉండగా, హైకోర్టు పుణ్యమా అని అది ఒక కొలిక్కి వస్తుందని ఆశించినవారికి నిరాశే మిగలింది.సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.తమ డబ్బు తమకు దక్కుతుందన్న ఆశతో లక్షలాది మంది డిపాజిట్ దారులు ఎపిలో పోలీస్ స్టేషన్ లలో తమ పేర్లను నమోదు చేసుకుని తమ డబ్బు చాలావరకు వచ్చేస్తుందని భావించారు.అలాంటివారికి ఇది పిడుగుపాటు వార్తే అవుతుంది.గత ఏడాది ఫిబ్రవరికి లో పోలీసులు అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకునే క్రమంలో పాతికవేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు మీడియాకు స్పస్టంగా చెప్పారు.కాని ఇప్పుడు వాటి విలువ 2500కోట్లే అని జిఫౌండేషన్ అంచనాకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సంస్థకు ఆస్తుల విలువ అదికారికంగా 4200 కోట్లుగా కనిపిస్తున్నా, అంత ఉండదన్నది ఫౌండేషన్ తాజా అంచనా.కాని అప్పులు పదివేల కోట్లు అని లెక్క చెబుతోంది. దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా, తెరవెనుక వ్యక్తులతో తమకు సంబందం లేదని తేల్చింది. ఒక వైపు పేద డిపాజిటర్లు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటే, మరో వైపు కొందరు పెద్దలు వందల ఎకరాల భూమిని ఎలా కారుచౌకగా కొట్టేయాలా అని ఆలోచిస్తున్నారన్న ఆరోపణలు రావడం దురదృష్టకరం. అసలు వీటిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు?గతంలో పాతికవేల కోట్ల రూపాయల ఆస్తి అని ప్రభుత్వ అదికారులే లెక్క గట్టినప్పుడు ఇప్పుడు దానిని తగ్గించవలసిన అవసరం ఏందుకు?అమరావతి రాజదాని భూమికి పరిసరాలలో అగ్రిగోల్డ్ భూములు ఎక్కువగా ఉండడం, వాటిని స్వాధీనం చేసుకుంటే, రాజధానిలో భూముల విలువ మరిఇంత తగ్గిపోతుందని భయపడి ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని కొందరు అంటున్నారు.అదే నిజమే అయితే ఇది దారుణం అని చెప్పాలి.ఒక్క ఎపిలోనే 19 లక్షల మంది మదుపుదారులు ఉంటే, తెలంగాణలో రెండు లక్షల మంది ఉన్నారు. ఎపిలో ముఖ్యమంత్రి దీనిని మరింత గందరగోళం చేసి ,ప్రజలను అయోమయంలో పడేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి కీలకమైన విషయాలలో ప్రజల తరపున పనిచేయవలసి ఉండగా, మోసగాళ్లకు,ప్రజలకు డబ్బు ఎగవేసిన వారికి అండగా ఉంటున్నాయన్న విమర్శలు రావడం, అదికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు కొందరు ఈ భూములను కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరం. గతంలో వైఎస్ జగన్ ఒక మాట చెప్పారు. ముందుగా ప్రభుత్వం ఈ డిపాజటి దారుల కు డబ్బు చెల్లించి, ఆ తర్వాత అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఆ సూచన పాటించి ఉంటే ఈపాటికి ఈ సమస్య పరిష్కారం అయి ఉండేది.ఇందువల్ల అటు డిపాజిట్ దారులకు, అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండేది. కాని ప్రభుత్వాలలోని పెద్దలు కొందరి చూపు భూముల మీదే తప్ప పేదలైన డిపాజిటర్ దారులపై లేకపోవడం బాదాకరం. వచ్చే ఏడాది కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ సమస్య పరిష్కారం కాదేమో!

tags : ap, agrigold

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info