ఎదుటి పక్షాల నేతలకు సంబందించి ఏదైనా కేసు కోర్టులో ఉన్నా పట్టించుకోకుండా కుమ్మక్కు అనో, మరొకటనో తెగ ఆరోపణలు చేసే తెలుగుదేశం పార్టీ తన పై ఆరోపణలు చేస్తే మాత్రం హైకోర్టు పరిధిలో ఉంటే కుమ్మక్కు అవుతామా?ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నిస్తోంది. ఎపి ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..వాటిని పరిశీలించండి.
అగ్రీ గోల్డ్ వ్యవహరం హైకోర్టు పరిధిలో ఉందని తెలిసీనా ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది.
అగ్రీ గోల్డ్ వ్యవహరం సీబీఐకి అప్పగిస్తే బాధితులకు న్యాయం జరుగుతోందా..?
అగ్రీగోల్డ్ ఇష్యూకు పరిష్కారం లభించకూడదని వైసీపీ భావిస్తోంది.
జీ-ఎస్సెల్ గ్రూపుని ప్రతిపక్షం భయాందోళనలకు గురి చేస్తోంది.
*జగనుకు సంబంధించిన వ్యక్తులు అగ్రీ గోల్డ్ యాజమాన్య ప్రతినిధులనూ కలిశారు.*
*సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు.. ఫొటోలతో సహా బయటపెడతాం.*
అగ్రీగోల్డ్ వ్యవహారాన్ని జఠిలం చేసేందుకు ప్రతిపక్షం చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
అగ్రీ గోల్డ్ వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి మేం సిద్ధంగా లేము.
అగ్రీ గోల్డ్ వ్యవహారాన్ని రాజకీయం చేయడం మొదలెట్టింది వైసీపీనే.
కోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశాల్లో కుమ్మక్కు ఎలా జరుగుతోంది.
ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యతలనే నేను నిర్వర్తిస్తున్నాను.
2012లో నిర్భయ కేసులో అడ్డ దిడ్డంగా మాట్లాడి మహిళలను కించపరిచే వ్యక్తి బొత్స.
అగ్రీ గోల్డ్ కూడా సహరా తరహా కేసే.
పెద్ద సంస్ధలు వస్తే సీబీఐ కేసులు వేస్తారంటూ బెదిరిస్తున్నారు.
*అగ్రీ గోల్డ్ వ్యవహారాన్ని సీబీఐకు అప్పజెప్పొద్దని బాధిత సంఘం కోరుతోంది.*
*అగ్రీ గోల్డ్ వ్యవహరం సీబీఐకి అప్పగిస్తే మరింత జాప్యం అవుతుందని బాధిత సంఘం ప్రతినిధులే చెబుతున్నారు.*
*ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని కోర్టు ఆదేశిస్తే బాధ్యత తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాం.*
సత్యం కేసు తరహాలో అందరికి న్యాయం చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
అన్ని రాష్ట్రాల్లోని అగ్రీ గోల్డ్ ఆస్తుల విలువ రూ. 6 వేల కోట్లు ఉంటుందని అంచనా.
ఏపీలో సుమారు రూ. 4 వేల కోట్ల ఆస్తులు ఉంటాయని భావిస్తున్నాం.
*రూ. 35వేల కోట్ల ఆస్తులు అగ్రీ గోల్డ్ సంస్ధలకున్నాయని వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది.*
*రూ. 5వేల కోట్లు చెల్లిస్తే అగ్రీ గోల్డ్ ఆస్తులను ఇవ్వడానికి కోర్టు సిద్ధంగానే ఉంది.*
సదావర్తి భూముల విషయంలో కూడా ఇదే తరహాలో వేయి కోట్ల రూపాయల విలువైన భూములంటూ తప్పుడు ప్రచారం చేశారు.
సదావర్తి వ్యవహరంలో దేవదాయ శాఖకు ఎంత ఆదాయం లభించిందో అందరికీ తెలుసు. tags : ap, kutumbarao, allegations