A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రాన్ని పలచన చేయవద్దు
Share |
April 21 2018, 1:50 am

తెలంగాణలో అప్పుల పై ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. పరిమితి లోపే అప్పులు ఉన్నాయని అన్నారు. ప్రతిసారి అప్పులు అంటూ రాష్ట్రాన్ని పలచన చేయవద్దని ఆయన సూచించారు. రాష్ట్ర జీడీపీలో 21 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే అప్పు చేశామని ఆయన వెల్లడించారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయని ఆయన అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం రూ.24 కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నది తెలంగాణలోనేనన్నారు. కేంద్ర జీడీపీలో 49.5 శాతం.. అంటే రూ.82 లక్షల కోట్లు అప్పు ఉందని, ఇందులో మోదీ సర్కారు రూ.25 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. అమెరికా, జపాన్ దేశాల అప్పు వాటి జిడిపి కన్నా ఎక్కువ ఉందని ఆయన ఉదహరించారు.

tags : kcr, debt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info