A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపివారికి ఇప్పుడు దురద పుట్టింది కనుక..
Share |
December 11 2018, 12:03 am

సడన్ గా యూటర్న్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అంతా మద్దతు ఇవ్వాలట.లేకుంటే వారిపై మాటల దాడిచేస్తున్నట్లుగా ఉంది. టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా సినిపరిశ్రమలోని హీరోలు, ఇతర నటులు పట్టించుకోవడం లేదంటూ అన్నారు జల్లికట్టు అంశంలో తమిళ ప్రజలకు అక్కడి చిత్ర పరిశ్రమ అండగా ఉందన్నారు. టాలీవుడ్‌కు ఏమైందని ప్రశ్నించారు. పోరాడే చేవ చచ్చిపోయిందా? అని అన్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, కేటీఆర్‌, కవిత పలువురు నాయకులు ఏపీ పోరాటానికి మద్దతు పలికితే అక్కడే ఉంటున్న తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక్కరూ కూడా దీనిపై మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. టిడిపికి ప్రత్యేక హోదాకు అనుకూలంగా యూ టర్న్ తీసుకోకముందు సినీ పరిశ్రమవారు మాట్లాడి ఉంటే ఏమి చేసేవారు. అంతెందుకు సినీ నటుడు శివాజీ ప్రత్యేక హోదా డిమాండ్ తో ఆందోళనకు దిగితే అరెస్టు చేసి మరీ హైదరాబాద్ తీసుకు వచ్చి వదలిపెట్టారే.ఏమిటో ఈ రాజకీయం.టిడిపి వారికి దురద పుట్టింది కనుక అంతా గోకాలన్నమాట.

tags : yvb, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info