A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కు లోకేష్ రిప్లై- ఆవుకధ
Share |
April 21 2018, 2:01 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.అది ఆవుకద మాదిరే ఉంది. ఈ నాలుగేళ్లలో జరిగిన అబివృద్ది హైదరబాద్ లో కూర్చున్న వారికి ఏమి కనిపిస్తుందని ఆయన అన్నారు. తనపై సిబిఐ విచారణ జరుగుతుందని పవన్ కళ్యాణ్ అసత్యప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.శేఖర్ రెడ్డికి, తనకు సంబందాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాట మార్చారని లోకేష్ అంటున్నారు.తాను తాత,తండ్రిలకు చెడ్డపేరు తేనని మరోసారి అన్నారు.8 ఏళ్లుగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని.. అంతకు మించి ఎక్కువ ఆస్తులుంటే వారే తీసుకోవచ్చని లోకేశ్‌ అన్నారు. చంద్రబాబుకు రెండున్నర మార్కులు వేయడానికి పవన్‌కల్యాణ్‌ ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రానికి అది చేశాం, ఇది చేశాం అంటూ లోకేష్ తన తండ్రి చంద్రబాబును మించి ఆవుకద చెప్పినట్లుగా ఉంది.

tags : lokesh, reply, pawan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info