A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏపీలో సీనియర్ ఐఏఎస్ లపై సీబీఐ కేసు!
Share |
September 19 2018, 11:12 am

ఏపీలోని ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లపై సీబీఐ కేసు!అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ సంచలన కదనాన్ని ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార వ్యవస్థలో భారీ కుదుపు రానుందా?. అంటే అవునంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికీ సీబీఐ పక్కా సమాచారం సేకరించింది. ఈ ఐదుగురిలో ముగ్గురు కీలక అధికార కేంద్రంలో ఉండగా…మరో ఇద్దరు అత్యంత ముఖ్యమైన శాఖల్లో ఉండటం విశేషం. అవినీతి ఆరోపణల కారణంగానే ఈ కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల క్రితమే కేంద్రంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంది. ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బిజెపి నేతలు ఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపిస్తోంది. దీనికి తోడు కొత్తగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా చంద్రబాబు సర్కారు అవినీతిపై వరస పెట్టి విమర్శలు చేస్తున్నారు.

నేరుగా రాజకీయ నేతలపై కేసులు వంటివి పెడితే అది రాజకీయ కక్ష సాధింపు కిందకు వస్తుందనే ఉద్దేశంతో తొలి దశలో ఐఏఎస్ లను టార్గెట్ చేసినట్లు సమాచారం. అందులో కూడా ప్రభుత్వానికి అడ్డగోలుగా సహకరించి..భారీ అవినీతికి కారణమైన వారిని ఎంపిక చేశారని…దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఇఫ్పటికే సీబీఐ సేకరించిందని సమాచారం. అయితే సీబీఐ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత రంగంలోకి దిగుతుందా?. లేక ఏప్రిల్ మొదటి వారంలో ‘ఆపరేషన్ స్టార్ట్’ చేస్తుందా? అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఏకంగా ఒకేసారి ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లపై అవినీతి ఆరోపణలపై కేసులు నమోదు చేస్తే అది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. చూడాలి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎన్ని సంచలనాలకు కేంద్రం అవుతాయో.

tags : ap, cbi, cases

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info