A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ రైతులకు సాల్యూట్ చేద్దాం
Share |
December 11 2018, 7:12 pm

మహారాష్ట్రలో రైతుల ఉద్యమం ఇటీవలికాలంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వేల మందితో జరగడం గొప్ప విషయమే. రైతులు తమ కష్టాలు, నష్టాలను భరిస్తూ లాంగ్ మార్చ్ చేయడం ,ప్రభుత్వం కూడా ప్రతిష్టకు పోకుండా రైతుల డిమాండ్ లలో అత్యధికం ఆమోదించడం, ఆ తర్వాత రైతులు ప్రశాంతంగా వెళ్లిపోవడం చరిత్రలో నిలిచిపోతాయి. ముప్పైఐదు వేల మంది సామూహికంగా పాదయాత్ర చూస్తే నాసిక్ నుంచి ముంబై వరకు రావడం దేశంలోనే కాదు.ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించిందని చెప్పాలి.సీపీఎం అనుబంధ సంస్థ అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో సాగిన ఈ యాత్ర సాగింది.ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ రైతుల ఆందోళనను అణచివేసే విధంగా కాకుండా, వారితో మాట్లాడి, వారి కోరికలను నెరవేర్చే ప్రయత్నించడం కూడా మంచి పరిణామమే. ఈ రైతులంతా ఆదివాసీలు. ఈ ‘లాంగ్‌ మార్చ్‌’లో యువ రైతులు మొదలుకొని వృద్ధుల వరకూ ఉన్నారు. కొందరు తల్లులు తమ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. కాళ్లకు చెప్పుల్లేనివారూ, అనారోగ్యంబారిన పడినవారూ, కట్టుకోవడానికి సరైన బట్టల్లేనివారూ ఈ 50,000మందిలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్నామంటున్న రుణాలను పొందలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక మొత్తాల్లో అప్పులు చేసి సేద్యం సాగించినవారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా అన్నది సంశయంగా ఉన్నా, ఇంతవరకు ప్రభుత్వం కూడా పద్దతిగా ఉందన్న భావన ఏర్పడింది.రుణమాఫీ తదితర డిమాండ్ లతో వీరు ఈ పాదయాత్ర చేశారు.

tags : farmers, long march

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info