A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నలబై ఏళ్ల ఎక్సీపీరియన్స్ నాది-చంద్రబాబు
Share |
June 23 2018, 2:06 am

తాను నలభై ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నానని, తనకు బిజెపి నేతలు రాజకీయాలు నేర్నుతారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తనకంటే రాష్ట్రం గురించి ఎవరికి ఎక్కువ తెలియని ఆయన చెప్పుకున్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, అత్యధిక కాలం ప్రతిపక్ష నేతగాఉన్నానని ఆయన అన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయనేతలలో తాను ఒకడినని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ వస్తాయంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని ఆయన చెప్పారు.విభజన హామీలపై భాజపా నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారు. 60ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తి వేరెవరికో వెళ్తే భాజపా నేతలకు బాధ కలగదా?. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ది అదే పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని భాజపా నేతలు అంటున్నారు. మరి భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదు? ఇదంత తనవల్లే జరిగిందని ఆయన అన్నారు.

tags : chandababu, experience

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info