A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా మీద ఎందుకు చర్య తీసుకున్నారు-జానా
Share |
June 23 2018, 2:08 am

శాసనసభలో సోమవారం జరిగిన ఘటనలతో తనకు ఎలాంటి సంబందం లేకపోయినా, తనను కూడా సస్పెండ్ చేశారేమిటని విపక్ష నేత జానారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.తనను షాక్ కు గురి చేసిందని ఆయన అన్నారు.రాజ్యాంగ విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తి చూపుతామన్న ఆందోళనతోనే ముందుగానే తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు. చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో తెరాస ఎంపీలు వారం రోజులుగా ఆందోళన చేస్తూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. తమపై మాత్రం చిన్న ఘటనను ఆసరాగా తీసుకుని వేటు వేయడం సరైన చర్య కాదన్నారు. దీనిపై మండల స్థాయిలో ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు.

tags : janareddy, comment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info