A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్వామిగౌడ్ పై దాడి ప్రచారంలో నిజం లేదు
Share |
June 24 2018, 1:16 am

శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడి జరిగిందని అనడం అవాస్తవమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని కావాలనే అసెంబ్లీ నుంచి గెంటేశారని అన్నారు.గతంలో హరీశ్‌రావు శాసనసభలో ప్రవర్తించిన తీరు కేసీఆర్‌ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. శాసనసభలో స్పీకర్‌ కనీసం తమ వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లుగా స్పీకర్ మదుసూదనాచారి నిర్ణయం తీసుకోలేదని, కాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మాత్రం వేటు వేశారని, ఇది దారుణమని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు.

tags : uttam, swamy goud

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info