A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి ఎక్కడ జాగ్రత్తపడాలి
Share |
December 11 2018, 7:15 pm

ఉమ్మడి రాష్ట్రంలోను, విభజిత ఎపిలోను సంచలనంగా అవతరించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో ఏట అడుగుపెట్టింది. అదికారానికి దూంగా ఉంటూ ఇంతకాలం పార్టీని నడపడం చిన్న విషయం కాదు.అందులోను తిమింగలం వంటి ప్రత్యర్ది రాజకీయ నేతలు ఉన్నచోట ,వారిని తట్టుకుని ప్రజలలో నిత్యం సంచరిస్తూ,తిమింగలాన్ని గడగడలాడిస్తున్న వ్యక్తిగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, విపక్ష నేత జగన్ గుర్తింపు పొందారు. ఈ ఏడేళ్లకాలం ఒక ఎత్తు అయితే, వచ్చే ఏడాది కాలం ఒక ఎత్తుగా ఆయన ఇప్పటికే తెలుసుకుని ఉంటారు.గత ఎన్నికల సమయంలో ఆయన కొన్ని పొరపాట్లు చేశారన్నది పలువురి నమ్మకం. అయితే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న భావన తనదని ఆయన అంటారు.మనం చేయలేని హామీలు ఇచ్చి ఎందుకు దెబ్బతినాలనేది ఆయన వాదనగా అప్పట్లో ఉండేది.అలాగే కొందరు పెద్ద పెద్ద నేతలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరతామని బతిమలాడినా, ఇచ్చిన మాట ముఖ్యమంటూ వారిని చేర్చుకోలేదు.అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు అలాంటివాటిని పట్టించుకోకుండా డబ్బు అనండి, ఇతరత్రా బలలాలనండి ఏమాత్రం ఉపయోగపడతారనుకున్నా వెంటనే పార్టీలో చేర్చుకున్నారు.అంతేకాదు.ఆరు వందల హామీలను గుప్పించారు.అవేవి సాద్యం కాదని తెలిసినా, అనుభవంతో అబద్దపు హామీలు ఇవ్వగలిగారు. జనాన్ని కొంతమేర నమ్మించకలిగారు.అలాగే బిజెపిని,జనసేనను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడ్డారు. కాని జగన్ మాత్రం పోరాట యోదుడిగానే ఉంది ఒంటరి పోరు చేశారు.జగన్ కూడా కొన్ని హామీలు అవి చేయగలిగినా, లేకపోయినా, ఇచ్చి ఉంటే విజయం ఆయననే వరించి ఉండేది.కాని ఆయన అలా చేయలేదు. అయినా విజయానికి దగ్గరగా వచ్చారు. అరవై ఏడు సీట్లు గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. గతం నుంచి వర్తమానానికి వస్తే ఇప్పుడు ఆయన సాహాసేపేతమైన రీతిలో పాదయాత్ర చేస్తున్నారు.వందలు,వేల సంఖ్యలో ప్రజలు ఆయనతో పాటు కలిసి నడుస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోకాని, విబజిత ఎపిలో కాని ఈ రకంగా ప్రజలను ఆకట్టుకున్న నేత మరొకరు లేరంటే అతి శయోక్తి కాదు.అయితే ఎన్నికలలో గెలవడానికి ఇవే సరిపోతాయా అంటే మాత్రం బిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అనూహ్యమైన రీతిలో జగన్ కు అనుకూల వేవ్ వస్తే ఎదురే ఉండదు. ఇప్పటికైతే ప్రజలలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం.అందుకే భయపడి ఆయన ప్రత్యేక హోదాపై మరోసారి మాట మార్చవలసి వచ్చింది. జగన్ ఇప్పటికే ఈ విషయంలో జనంలోకి ముందుకు వెళ్లిపోయాడన్న బయంతోనే చంద్రబాబు మాట మార్చడానికి వెనుకాడలేదు. అయితే ఎన్.డి.ఎ. నుంచి బయటకు రావడానికి ఇప్పటికైతే చంద్రబాబు భయపడుతున్నది కనపడుతూనే ఉంది. చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే తాను బిజెపితో ఉంటూనే జగన్ బిజెపి వద్దకు వస్తాడని దుష్ప్రచారం చేయగలరు. అలాంటివాటిని జగన్ తిప్పికొట్టడం ఒక కార్యక్రమం అవుతోంది.చంద్రబాబు ఎమ్మెల్యేలను కోట్లకు కొనుగోలు చేసి అప్రతిష్టపాలైతే ,విపక్షంలో ఉండి కూడా నంద్యాలకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రస్ లోకి రావాలంటే ఆ పదవికి రాజీనామా చేయాల్సిందనని స్పష్టం చేసి జగన్ ప్రతిష్ట పెంచుకున్నారు.పాదయాత్ర సమయంలో ఆయా నియోజకవర్గాలలో పార్టీ నేతల మద్య ఉన్న తగాదాలను తీర్చడానికి జగన్ మరికొంత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. చంద్రబాబు ఈసారి మరింత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.దానిని ఎదుర్కోవడానికి ప్రజలలో మరింత చైతన్యం పెంచడానికి కూడా జగన్ ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది.అభ్యర్ధుల ఎంపిక అన్నది కీలకమైన అంశం కావచ్చు. వేవ్ వస్తే ఎవరు అభ్యర్ది అయినా ఆటోమాటిక్ గా గెలుస్తారు.అయినా ఈ విషయంలో జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మాట ఇచ్చాను కనుక అదే అభ్యర్దిని నిలబెడతానని కాకుండా గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవాలన్నది కొందరి సూచనగా ఉంది.నిజానికి చంద్రబాబు అనుభవం ముందు జగన్ అనుభవం చిన్నది. కాని చంద్రబాబు అబద్దాల విషయంలోకాని, అనైతిక రాజకీయాలకు పాల్పడడంలో కాని అప్రతిష్ట తెచ్చుకుంటే జగన్ మాత్రం తాను అబద్దాలు చెప్పలేనని,తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి విశ్వసనీయతగా పెద్ద పీట వేస్తానని ఆ దిశగా ప్రయత్నం సాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై కేసులు వస్తాయని తెలిసిన యోధుడు జగన్ అయితే ,ఎక్కడ కేసులు వస్తాయోనని కాంగ్రెస్ తోనే రాజీపడ్డ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు అవుతారు.అయితే తప్పుడు ప్రచారం ,అబద్దాలు ప్రచారాలు చేయడంలో మాత్రం చంద్రబాబు ముందు జగన్ నిలవలేరు.అందువల్ల వీటిని తిప్పికొట్టడానికి కూడా జగన్ వ్యూహం సిద్దం చేసుకోవాలి.జగన్ ప్రస్తుతం పడుతున్న శ్రమ కు తగ్గ పలితం వస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. జగన్ ను ఒక్కసారి సి.ఎమ్. చేయాలన్న అభిప్రాయం కూడా పెరుగుతోంది. దానిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నిలబెట్టుకుంటే అదికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు.

tags : ysr congress, eitghth anniversary

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info