A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జానారెడ్డి ని ఎలా సస్పెండ్ చేస్తారు-బిజెపి ప్రశ్న
Share |
September 25 2018, 2:24 am

విపక్ష నేత జానారెడ్డిని సస్పెండ్ చేయడం సభకు శోభనివ్వదని బిజెపి పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. జానారెడ్డిపై చర్య అకారణంగా ఉందని, జానారెడ్డి నిన్న జరిగిన గొడవపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారని ,అయినా ఆయనపై సస్పెండ్ వేయడం ఏమిటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలలో టిఆర్ఎస్ ఎమ్.పిలు స్పీకర్ ఎదుట ప్లకార్డులు ఎలా ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. లేని సమస్య సృష్టించి మరీ టిఆర్ఎస్ ఎమ్.పిలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకుని పార్లమెంటులో అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి వారు ఆందోళన చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ ఎమ్.పిలు ఇక్కడ లేరని అన్నారు. జానారెడ్డి ఏమి చేశారో మీకు తెలుసా అని ఆయన అన్నారు. వీడియో రికార్డులు చూశామని అన్నారు. జానారెడ్డి అంటే మాకు గౌరవం లేదా అని ఆయన అన్నారు. కాగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ఇంత అసహనం పనికిరాదని ,బుల్ డోజ్ చేయడం కాదని అన్నారు.

tags : kishanreddy, bjp,suspension

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info