A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు తెలుగువారు
Share |
June 24 2018, 1:07 am

ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ సీటు పొందిన అరుదైన గౌరవం మరో తెలుగువాడికి దక్కింది. బిజెపి అదికార ప్రతినిది జివిఎల్ నరసింహారావు ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకు రావాలని బిజెపి నిర్ణయించింది. 2011 లోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రదాని అవుతారని జోస్యం చెప్పిన జివిఎల్ మద్యప్రదేశ్ ప్రభుత్వానికి చాలాకాలం సలహాదారుగా వ్యవహరించారు. ప్రజాభిప్రాయ క్రోడికరణ రంగంలో పేరొందిన నరసింహారావు బిజెపి జాతీయ అదికార ప్రతినిదిగా ఉన్నారు. ఆంద్రప్రదేశ్ కు చెందిన ఈయన చాలాకాలంగా డిల్లీలోనే ఉంటున్నారు. గతంలో నాలుగుసార్లు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లిన ఏకైక తెలుగు నేత ఎమ్.వెంకయ్య నాయుడు. ఆయన మూడుసార్లు కన్నాటక నుంచి, ఒకసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బిజెపి తరపున ఎన్నికయ్యారు.తదుపరి ఆయన ఉప రాష్ట్రపతి అయ్యారు. కాగా కాంగ్రెస్ పక్షాన కేంద్ర మాజీ మంత్రి,దివంగత నేత పి.శివశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఇలాంటి అవకాశం తక్కువ మందికి వస్తుంటుంది.

tags : gvl, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info