A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం -కొత్త కాంట్రాక్టర్ కూడా ...
Share |
June 24 2018, 1:13 am

పోలవరం ప్రాజెక్టులో ఒక భాగాన్ని కొత్త కంపెనీకి అప్పగించినా, ఆశించిన లక్ష్యం మేరకు పనులు జరగడం లేదని హిందూ పత్రిక ఒక కధనం ఇచ్చింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి పని తొలగించి నవయుగ కంపెనీకి అప్పగించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ కంపెనీ రోజుకు 1.1లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయడానికి అంగీకరించింది. కాని తాజాగా ఆ సంస్థ దీనిని ఎనభై వేల క్యూబిక్ మీటర్లకు తగ్గించింది.దీంతో మేనెల నాటికి పూర్తి చేయవలసిన లక్ష్యం పెరిగింది. మరి అది సాద్యం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. కాగా మట్టి తవ్వకానికి సంబందించి తమకు ఇవ్వవలసిన తొంభై కోట్ల బకాయిలు చెల్లించాని సంబందిత సంస్థ ప్రభుత్వాన్ని కోరగా, విదేశీ సంస్థ తాము చేస్తున్న జెట్ రూటింగ్ పనికి రేట్లు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.ఇదిలా ఉండగా, కేంద్ర సంస్థ నుంచి కొన్ని డిజైన్ లు ఇంకా ఆమోదం పొందవలసి ఉంది. దీంతో పోలవరం ప్రాజెక్టు లో నిర్దిష్ట లక్ష్యాల ప్రకారం సాగడం లేదని ఆ కదనం వివరించింది.

tags : polavaram, new contractor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info