A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక హోదా రాదంటున్న టిడిపి ఎమ్.పి
Share |
June 24 2018, 1:16 am

ఎపికి ప్రత్యేక హోదా రాదని అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఈరోజు లోక్ సభకు వెళ్లకుండా అమరావతిలో శాసనసబ ఆవరణలో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ముఖ్యమంత్రి చద్రబాబు కూడా బడికి (పార్లమెంటుకు ) ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారని, అలాగైతే పెయిల్ అవుతారని అన్నారని, కాని తాను ఎన్నడూ పెయిల్ కాలేదని చెప్పానని ఆయన అన్నారు. అయితే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కనిపించడం లేదని అన్నారు. తాను మళ్లీ చట్టసభకే పోటీచేస్తానని ఆయన అన్నారు. ఎన్నిక ద్వారా సబలోకి రావడం, ఎంపిక ద్వారా సభకు రావడానికి తేడా ఉందని దివాకరరెడ్డి అన్నారు.

tags : jc special status

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info