A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంంద్రం లోటు ఉందంటే ,ఎపి లేదంటూ బడ్జెట్
Share |
December 11 2018, 6:45 pm

కేంద్ర ఆర్దిక సంఘం గతంలో చేసిన పరిశీలనలో ఎపి ప్రభుత్వం 2020 వరకు రెవెన్యూ లోటులో ఉంటుందని నిర్దారిస్తే , ఎపి ప్రభుత్వం మాత్రం అప్పుడే రెవెన్యూ మిగులుకు వచ్చేసినట్లు బడ్జెట్ లో చూపడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. మరో వైపు తమకు ఇవ్వవలసిన రెవెన్యూలోటు మొత్తం ఇవ్వలేదని వాదిస్తూ కేంద్రాన్ని తప్పు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ మిగులు బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని విశ్లేషణలు వస్తున్నాయి.ఇదంతా కొత్త అప్పుల కోసం రాష్ట్రం ఎత్తుగడ వేసిందని, దీనివల్ల మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు. 2015–16 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటులో ఉంటుందని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద 2015 నుంచి 2020 వరకు రాష్ట్రానికి రూ.22,113 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. 2019–20 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉంటుందని సాక్షాత్తూ 14వ ఆర్థిక సంఘమే స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.5,235 కోట్ల మేర రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. దీనివల్ల కేంద్రానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నామో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారని కదనం. ఏపీలో మిగులు బడ్జెట్‌ ఉందనే సాకుతో కేంద్రం 2018–19లో రెవెన్యూ లోటు కింద నిధులు ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద కేంద్రం నుంచి 2018–19లో రూ.3,644 కోట్లు, 2019–20లో రూ,2499 కోట్లు రావాల్సి ఉంది. 2014–15లో 10 నెలలకు ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.4,000 కోట్లు ఇచ్చామని, ఇక రూ.138 కోట్లే వస్తాయని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే.

tags : ap, budget

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info