A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంటింటికి కంటి వైద్య పరీక్షలు
Share |
December 11 2018, 7:54 pm

ప్ర‌పంచ గ్లాకోమా వారోత్స‌వాల‌లో భాగంగా నేటి నుంచి 17వ తేదీ వ‌ర‌కు
నిర్వ‌హిస్తున్న‌ ప్ర‌పంచ గ్లాకోమా వారోత్స‌వాలను పుర‌స్క‌రించుకొని అంధ‌త్వ
నివార‌ణ సంస్థ‌, స‌రోజ‌నీ కంటి ద‌వాఖానా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవేర్‌నెస్
వాక్‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి ఆదివారం
హైదరాబాద్‌లోని స‌రోజ‌నీలో ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి
నాయిని న‌ర్సింహారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. నీటి కాసులుగా పిలిచే ఈ వ్యాధి
చూపుపై  నిశ్శ‌బ్ధంగా, వేగంగా ప్ర‌భావం చూపే ఒక ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి. ఈ
వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం పెంచేందుకు ఈ వాక్‌ని నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా వైద్య ఆరోగ్య మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, 
40ఏళ్ళ పైబ‌డిన వాళ్ళ‌ల్లో వార‌స‌త్వంగా సంక్ర‌మించే ఈ గ్లాకోమాని గుర్తించ
గ‌లితితే సాధ్య‌మైనంత వైద్య చికిత్స అందించ‌వచ్చున్నారు. క‌ను గుడ్డు చుట్టూ రంగుల
వ‌ల‌యాలు ఏర్ప‌డ‌టం, నొప్పి ఉండ‌టం, చూపు మంద‌గించ‌డం, కాంతి లేక‌పోవ‌డం వంటి
ల‌క్ష‌ణాలు గ్లాకోమావన్నారు. త‌ల‌నొప్పితో అలాగే త‌ర‌చూ కంటి అద్దాలు మార్చాల్సి
వ‌స్తుంటుంది. అయితే, ప్ర‌పంచ వ్యాప్తంగా 3శాతం మంది గ్లాకోమా వ్యాధి
ల‌క్ష‌ణాల‌తో బాధ ప‌డుతున్నారని, ఇండియాలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బారిన
ప‌డ్డారని స‌ర్వేలు చెబుతున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌పంచంలోని గ్లాకోమా వ్యాధి
గ్ర‌స్తుల్లో స‌గం మంది మ‌న దేశంలోనే ఉన్నారు. అంధ‌త్వానికి రెండో అతి పెద్ద
కార‌ణం గ్లాకోమా. ప్ర‌తి ఏడాది ఒక్క స‌రోజ‌నీ దేవి ద‌వాఖానా ప్ర‌తి ఏడాది 10వేల మందికి
వైద్య సేవ‌లు అందిస్తున్న‌ది. అందులో ప్ర‌తి ఏడాది స‌గ‌టున 600 మందికి శ‌స్త్ర
చికిత్స‌లు చేస్తున్నారని మంత్రి వివ‌రించారు. అలాగే సీఎం కెసిఆర్ చొర‌వ‌తో రాష్ట్ర
వ్యాప్తంగా ఇంటింటికీ కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా మంత్రి చెప్పారు. 
హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి మాట్లాడుతూ, ప్ర‌జల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం
క‌లిగించ‌డం, వ్యాధిని ప్రాథ‌మిక స్థాయిలో గుర్తించ‌డం, క్ర‌మం త‌ప్ప‌కుండా చికిత్స
చేయించుకుంటే గ్లాకోమా వ్యాధి నుంచి త‌ప్పించుకోవ‌చ్చని వైద్యులు
చెబుతున్నార‌ని, ప్ర‌జ‌లు వీటిని దృష్టిలో పెట్టుకుని చైత‌న్యం కావాల‌న్నారు. చూపు
40ఏళ్ళుదాటిన త‌ర్వాత ప్ర‌తి వాళ్ళ‌ల్లోనూ చూపు మంద‌గిస్తుంద‌న్నారు. ప్ర‌తి ఏడాది
ప‌రీక్ష‌లు చేయించుకుంటూ, చూపు మంద‌గిస్తే డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.  
కాగా, ప్ర‌పంచ గ్లాకోమా వారోత్స‌వాల సంద‌ర్భంగా స‌రోజ‌నీ ద‌వాఖానా ఆధ్వ‌ర్యంలో
ప్ర‌జా చైత‌న్యం క‌లిగించే ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థుల‌కు వ్యాస ర‌చ‌న
పోటీలు, స్లోగ‌న్స్‌, పోస్ట‌ర్ల పోటీ, రోగుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, అలాగే
ప్ర‌త్యేకంగా ఈ వారం రోజుల పాటు గ్లాకోమా స్క్రీనింగ్ కార్య‌క్ర‌మాల‌ను
నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌రోజ‌నీ కంటి ద‌వాఖానా సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్
గౌడ్ తెలిపారు. ప్ర‌జ‌లు ఈ స‌దుపాయాల్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న
విజ్ఞ‌ప్తి చేశారు.

tags : lakshmareddy, eyes

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info