A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బంజారా హిల్స్ లో ఫేస్ క్లినిక్స్
Share |
March 24 2019, 8:35 pm

అందంగా ఉండాల‌నుకోవ‌డం, మ‌రింత అందంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నించ‌డం మ‌నుషుల
స‌హ‌జ ల‌క్షణ‌మ‌ని, త‌మ అందాన్ని ఇనుమడింప చేసుకోవడానికి వీలుగా ఏర్ప‌డుతున్న ఫేస్
క్లీనిక్స్‌కి ఆద‌ర‌ణ బాగా పెరుగుతున్న‌ద‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. ఫేస్ ఇంప్లాంట్ శ‌స్త్ర
చికిత్స‌ల‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు అనుగుణంగా ఆ రంగంలో 8 ఏళ్ళుగా కృషి చేస్తున్న
ఫేస్ క్లీనిక్స్ రఘునాథరెడ్డి ఆధ్వ‌ర్యంలో మరో కొత్త క్లీనిక్
బంజారాహిల్స్‌లో అందుబాటులోకి రావ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ విష‌జ్ఞ‌మ‌న్నారు.
కొత్త ఫేస్ క్లీనిక్‌ని మంత్రి ప్రారంభించారు. 
వైద్య రంగంలో అందుబాటులోకి వ‌స్తున్న కొత్త సాంకేతిక‌త‌తో వివిధ కార‌ణాల‌తో
ఎదురైన ఇబ్బందుల‌ను అదిగ‌మించ‌డానికి, ముఖ క‌వ‌లిక‌ల‌న స‌రిదిద్ద‌డానికి ఈ మ‌ధ్య
అనేక మంది ఆస‌క్తి చూపిస్తున్నార‌ని మంత్రి తెలిపారు. జ‌న్మ‌త‌, మ‌ధ్య‌లో వ‌చ్చే
ఆరోగ్య‌, అనుకోని సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఫేస్ క్లీనిక్‌ల అవ‌స‌రం కూడా
ఏర్ప‌డుతున్న‌ద‌న్నారు. ప్ర‌త్యేకంగా సెల‌బ్రిటీలు ఫేస్ క్లీనిక్‌ల‌పై ఎక్కువ‌గా
ఆధార‌ప‌డుతున్నార‌న్నారు. 
ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ, ఫేస్
చికిత్స‌ల్లో ఫేస్ క్లీనిక్ పాత్ర అభినంద‌నీయ‌మ‌న్నారు. క్లీనిక్ ఎండి డాక్ట‌ర్
ర‌ఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ, ఫేషియ‌ల్ ఇంజూరీస్‌తోపాటు పుట్టుక‌తో వ‌చ్చే
ఇబ్బందిక‌ర శారీర‌క లోపాల‌ను స‌రిదిద్దుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి
క‌న‌బ‌రుస్తున్నార‌న్నారు. అలాంటి వాళ్ళ కోసం త‌మ క్లీనిక్ అరుదైన శస్త్ర
చికిత్స‌లు, స‌ర‌స‌ర‌మైన ధ‌ర‌ల్లోనే అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ఇంకా ఈ
కార్య‌క్ర‌మంలో న‌ర్సాపూర్ ఎమ్మెల్యే మ‌ద‌న్‌రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్
త‌దిత‌రులు పాల్గొన్నారు.

tags : lakshmareddy, face clinics

Latest News
*lనెల్లూరులో నారాయణ డబ్బును పట్టుకున్నారు
*జనసేన ప్రభుత్వమే వస్తుంది-పవన్ కళ్యాణ్
*నేను కాకపోతే భార్య పోటీచేస్తుంది-వైసిపి అభ్యర్ది
*చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయి-జగన్
*జగన్ తో సుబ్బారాయుడు భేటీ
*పవన్ అవమానిస్తున్నారు-సిపిఐ నేత
*ఏమి జరిగినా చంద్రబాబే బాద్యుడు-మోహన్ బాబు
*చంద్రబాబు, లోకేష్ నామినేషన్ల పొరపాట్లు..
*దర్మరాజుకు ధర్మం నేర్పే చంద్రబాబు-జగన్ ఎద్దేవ
*చంద్రబాబు ఏమి చేసింది చెప్పడం లేదే
*జనసేన కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది
*టిడిపికోసం నన్ను బలిచేశారు-జనసేన నేత
*ప.గో.లో తెలుగుదేశం కు మరో షాక్
*నేనే సి.ఎమ్.గా ప్రమాణ స్వీకారం చేస్తా-పవన్
*వివేకా హత్యకేసు-కుమార్తె సునీత ఆవేదన
*కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
*మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి-జగన్ హామీ
*కాపులంటే మెగాస్టార్ ప్యామీలీనే కాదు
*టిడిపి మంచి స్వింగ్ లో ఉంది-చంద్రబాబు
*బ్యాంకు రుణాల బకాయి-రాయపాటి ఆస్తుల వేలం
*కక్షసాధింపు మొదలైంది-మోహన్ బాబు
*చంద్రబాబు మాట తప్పారు..అందుకే వదలివేశా
*గంటా,రామాంజనేయులు,పవన్ బందం
*సుమలతకు బిజెపి మద్దతు
*చంద్రబాబు,పవన్ లపై వైసిపి ఫిర్యాదు
*మరుగుదొడ్లు కట్టించా-చంద్రబాబు
*పవన్ వాదనలు తమాషాగానే ఉన్నాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info