A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
Share |
March 25 2019, 6:38 am

తెలంగాణలోను ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మాజీ మంత్రి మర్రి శశిదర్ రెడ్డి నాయకత్వంలోని ఒక బృందం ఎన్నికల కమిషన్ ను కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో అవకతవకలు జరిగాయని ఆయన పిర్యాదు చేశారు.తుది జాబితాను అప్పుడే ప్రకటించవద్దని ఈ బీందం ఇసిని కోరింది.
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం దంతానపల్లి గ్రామపంచాయతీ ఉప ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ ఆధారాలు అందజేశారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేఖ రాశారని ఆయన మీడియాకు వెల్లడించారు. చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు.

tags : congress,voters list

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info