A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
Share |
September 19 2018, 8:17 am

ప్రఖ్యాత సినీ నటి శ్రీదేవి చిన్న వయసులోనే కన్నుమూశారన్న వార్త సినీ అబిమానులందరిని విషాదంలో ముంచింది.ఆమె వయసు కేవలం ఏభైనాలుగేళ్లే.ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకుగాను ఆమె కుటుంబంతో కలిసి దుబాయి వెళ్లారు. అక్కడే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని సమాచారం.ఈ విషయాన్ని ఆమె మరిది సంజయ్ కపూర్ నిర్దారించారు.శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్‌, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మా యాంగేర్‌ అయ్యపాన్‌’.1975 చిన్నతనంలో తునాయివన్‌ డసినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి వివిధ భాషల సినిమాలలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. . తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా వెలుగొందారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.2017లో చివరిగా ‘మామ్‌’ చిత్రంలో నటించారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్‌లో తెరంగేట్రం తర్వాత 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి-బోనికపూర్‌ దంపతులకు జాన్వీ, ఖుషిలు ఉన్నారు. పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.శ్రీదేవికి 2013 లో పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది.శ్రీదేవి మరణానికి నివాళి అర్పిద్దాం.

tags : sridevi, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info