A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
Share |
March 25 2019, 6:39 am

తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అధికార టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించారు.ముఖ్యంగా విద్యార్ది లోకం తీవ్ర నిరాశతో ఉందని ఆయన అన్నారు. నిరుద్యోగులంతా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఉద్యమంలో పనిచేయబోతున్నారని ఆయన చెప్పారు. కేంద్రం ప్రతి సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ముద్రయోజన ద్వారా స్వయం ఉపాధి కల్పించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని వెల్లడించారు. త్వరలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేపీ యువ మోర్చా నగారా మోగించిందని ప్రకటించారు. దేశంలో బీజేపీని ఎదిరించిన వ్యక్తిలేడని మురళీధర్‌రావు అన్నారు.తెలంగాణ యువత ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు.

tags : bjp, trs

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info