A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
Share |
March 25 2019, 6:40 am

తెలంగాణలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులపై టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి ద్వజమెత్తారు.దీనివల్ల మార్కెటింగ్ వ్యవస్థను టిఆర్ఎస్ నేతల చేతులలో పెట్టారని ఆయన విమర్శించారు. నామినేటెడ్ పదవులను తెరాస నేతలు, అనుచరులకు కట్టబెట్టిందని ఆయన అన్నారు. గతంలో ఆదర్శ రైతుల పేరుతో కాంగ్రెస్ చేసిన తప్పు ఇప్పుడు తెరాస చేస్తోందన్నారు. జీవో 26 దుర్మార్గమైనదని, అధికారులను, ప్రభుత్వ వ్యవస్థలను తెరాస నాశనం చేస్తోందని అన్నారు.. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చెయ్యడం తప్ప చేసిందేమి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే కేసీఆర్.. జాతీయ హోదాపై కేంద్రానికి డీపీఆర్‌ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు.

tags : ravula, farmers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info