A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
Share |
December 11 2018, 6:33 pm

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆలోచన చేస్తోందని కధనం వచ్చింది. ఒక వైపు ఎపి లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీ గా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి అమలు చేయలేకపోయింది.కాని తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను కాస్త ఊరడించడానికి బృతి ఇవ్వాలని తలపెట్టింది. కొత్త రాష్ట్రంలో ఆశించినన్ని ఉద్యోగావకాశాలు రాకపోవటంతో అసంతృప్తితో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ప్రతినెలా ఆర్థిక సాయం అందించే నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి అవసరమైన విధివిధానాలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లోనే ఈ పథకాన్ని ప్రకటించాలని భావిస్తోంది. నిరుద్యోగ భృతి అమలుకు అవసరమైనన్ని నిధుల కేటాయింపులు, సాధ్యాసాధ్యాలపై అధ్యయన బాధ్యతను ఆర్థిక శాఖకు అప్పగించినట్లు సమాచారం. 18 ఏళ్లు నిండి డిగ్రీ పూర్తి చేసి.. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగం లేని వారందరినీ ఈ పథకానికి అర్హులుగా పరిగణించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులుంటారన్న అంచనా వేస్తున్నారు.

tags : telangana,job

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info