A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
Share |
June 24 2018, 12:49 am

రాజధాని అమరావతికి వారు వస్తున్నారు..వీరు వస్తున్నారు అంటూ ఊదరగొట్టి చేసిన ప్రచారం అంతా ఉత్తిదే అని ప్రభుత్వమే తేల్చిందని అనుకోవాలి.తన అనుకూల మీడియాతో చేసిన ప్రచారం అంతా డొల్ల అని ఈ వార్త చెబుతుంది. అమరావతిలో ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించాలని తలపెట్టిందట. దానికి కారణం ప్రభుత్వమే ఈ వెంచర్లు వేస్తే సత్వరం అభివృద్ది జరిగే అవకాశం ఉందని తాజాగా భావిస్తున్నారని ఈనాడు కధనం. వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించి వేలంలో విక్రాయించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు ఆమోదం తెలిపారు. రాజధాని సంస్థ ద్వారా వీటిని నిర్మించనున్నారు. చదరపు అడుగుకు మూడువేల రూపాయల లోపు వరకు రేటు ఉండవచ్చని చెబుతున్నారు.అదండి సంగతి.నిజంగానే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చిందన్నమాట.ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం లేదని పరోక్షంగా తెలియచేశారన్నమాట.

tags : amaravati, flats

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info