A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
Share |
March 25 2019, 7:12 am

ఎంత ఆరాచకం, ఎంత అనైతికం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పిరాయింపు ఎమ్మెల్యేలతో వచ్చిన తలనొప్పిని తగ్గించుకునేందుకు అవినీతి చేసి పంచుకోండని స్వయంగా సలహా ఇచ్చారట.ఈ విషయం స్వయంగా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి వెల్లడిచేశారు. ఒక ఎమ్మెల్యే తాను తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయానని, నిజం చెబుతున్నాని, తప్పు చేశానని ఓపెన్ గా చెబితే, పిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి అక్కడ స్తానికంగా ఉన్న మరో టిడిపి నేతతో పంచాయతీ తీర్చడం కోసం అవినీతి సొమ్ములో ఏబై శాతం పంచుకోమన్నారట. అదృష్టవశాత్తు ఈ వీడియో బయటకు వచ్చింది.లేకుంటే అలాంటిది ఏమీ లేదని డబాయించేవారు.జమ్మలమడుగు నుంచి వైసిపి పక్షాన ఆదినారాయణ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ,ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పి ఉండవచ్చు.వెంటనే నైతిక విలువల గురించి బోదించే చంద్రబాబు నాయుడు వద్ద కు వెళ్లి టిడిపి జెండా కప్పించుకున్నారు.ఇలా చెత్త పిరాయింపు రాజకీయాలు చేయడమే కొత్త విలువలని చంద్రబాబు సిద్దాంత రచన చేశారు. అక్కడితో ఆగలేదు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేశారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆంద్ర సమాజానికి తాను ఎంత నీచ రాజకీయం చేయగలనో చంద్రబాబు తెలియ చెప్పారు. ఈ ప్రక్రియలో రాజకీయ నేతలతో పాటు ఐఎఎస్,ఐపిఎస్ అదికారులు కూడా భాగస్వాములు అవడం మరో ప్రక్రియగా ఉంది.ఇది అత్యంత దురదృష్టకరం. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి దీనిపై ఆరోపణ చేస్తే ఐఎఎస్ ల సంఘం అభ్యంతరం తెలిపిందని వార్త వచ్చింది.నిజంగా ఐఎఎస్ లు, ఐపిఎస్ లు అంత నిష్పక్షపాతంగా ఉంటున్నారా ?అన్నది వారు గుండెమీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలి. ఇంటిలెజెన్స్ అదికారిగా ఉన్న వెంకటేశ్వరరావుపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.ఆయన అచ్చంగా తెలుగుదేశం తరుపున పనిచేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపణ. గతంలో సాయి ప్రసాద్ కు గాని, సతీష్ చంద్రకుకాని కాస్త మంచిపేరే ఉండేది. మరి వారు కూడా ఇలా మారిపోయారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కాల మహిమ.నీ చుట్టూ ఉన్నవారెవరో చెప్పు..నీవు ఎలాంటి వాడివో చెబుతానని అంటాడు ఒక రచయిత. అలాగే చంద్రబాబు వద్ద పనిచేసేసరికి వీరికి కూడా అలాగే అనైతిక ,విలువలు లేని పద్దతులు అలవాటు అయ్యాయని అనుకోవాలి. స్వయంగా మంత్రి ఆదినారాయణరెడ్డి ఇద్దరు ఐఎఎస్ అదికారులను దగ్గరబెట్టుకుని మరీ పంచాయతీ చేశారని వెల్లడించారు.మరి ఇప్పుడు ఐఎఎస్ సంఘం దీనిని కూడా ఖండిస్తే అబినందించవచ్చు.కాని కుక్కిన పేను మాదిరే వ్యవహరిస్తే మాత్రం ఏమనాల్సి ఉంటుంది?జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి రావడం, మంత్రి అవడం అక్కడ సుదీర్ఘకాలంగా టిడిపిలో ఉన్న రామసుబ్బారెడ్డి వర్గానికి సుతరాము ఇష్టం లేదు. అయినా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనను సంతృప్తి పరిచే యత్నం చేశారు. అయినా వారి గొడవలు ఆగలేదు. దాంతో అవినీతి సొమ్ములో సగం,సగం పంచుకోవండని చంద్రబాబే చెబితే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి.ఇది కేసు అవుతుందా?అవదా?ఆమాట కు వస్తే చంద్రబాబు స్వయంగా ఓటుకు నోటు కేసులో దొరికిపోతేనే ఏమీ కాని చట్టాలు, న్యాయ వ్యవస్థ మనది.చంద్రబాబుకు ఆయా వ్యవస్థలలో అంత పలుకుబడి ఉంది. అదేమిటో చంద్రబాబు ఏమి చేసినా ఆ సంస్థలు ఉదారంగా ఉంటాయి.ఇక కొడుమూరు పిరాయింపు ఎమ్మెల్యే మణిగాందీ తాను అమ్ముడు పోయానని బహిరంగంగానే చెప్పారు.వీటన్నిటికి ఎవరు జవాబు ఇవ్వాలి?ఇలాంటివి జరిగితే చర్య తీసుకోవాలసిన ముఖ్యమంత్రే చండాలపు పిరాయింపు రాజకీయాలకుపాల్పడి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కితే రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి వంటివారు సైతం ఆయన పక్కన కూర్చుని మెచ్చుకుని వెళుతుంటే ఈ చట్టాలు, రాజ్యాంగం సామాన్యుడిని వేదించడానికేనా?చంద్రబాబు వంటివారికి వర్తించవా అని ఎవరైనా అడిగితే ఏమి చెప్పాలి.ఏమి చేస్తాం మన ఖర్మ అని సరిపెట్టుకోవడం తప్ప.

tags : ap, defections

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info