A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
Share |
March 25 2019, 7:15 am

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి వాపోయారు. తన బర్త నారాయణరెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న కొందరు తమకు సంబందించినవారిని బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి కుమారుడు శ్యాంబాబు కూడా ముద్దాయి అని, కాని తన పలుకుబడితో ఆయనపై కేసు తీయించారని తాను కోర్టుకువెళ్లగా ,వారిపై కేసు నమోదు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేఈ శ్యామ్‌బాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్లు శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైందని, అది వాస్తవం కాదని తెలిపారు. హైకోర్టులో శ్యామ్‌బాబుకు ఎలాంటి స్టే రాలేదన్నారు. దీనిపై ఏ ఆధారాలతో వార్త ప్రచురించారో ఆంధ్రజ్యోతి యాజమాన్యం, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పును సైతం ఆంధ్రజ్యోతి అపహాస్యం చేస్తోందని, దీనికి టీడీపీ నాయకులు వంత పాడుతున్నారని విమర్శించారు. తమ కుటుంబం, అనుచరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ స్టే వచ్చినా,తాము సుప్రింకోర్టుకు వెళతామని ఆమె అన్నారు.

tags : ap,high court, ke family

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info