A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీనియర్ పాత్రికేయుడు కన్నుమూత
Share |
August 22 2018, 1:23 am

సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ చరిత్రకారుడు జి.వెంకటరామారావు మరణించారు. ఆయన వయసు ఎనభై నాలుగేళ్లు. వృద్దాప్యంలో కూడా చరిత్ర,రాజకీయాలకు సంబందించి అనేక వ్యాసాలు రాసిన వెంకటరామరావు హైదరాబాద్ పాతబస్తీ లోని గౌలిపురాలో నివసిస్తారు. ఆయనకు భార్య అహల్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 38ఏళ్లపాటు వివిధహోదాల్లో ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. సుమారు రెండువేలకు పైగా రచనలు చేశారు. ‘పరిష్కారం’ పేరుతో కథానికల సంపుటి ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌ చర్రితపై నాలుగు గ్రంథాలు రచించారు. తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర, ప్రధాన మంత్రి పివి నరసింహారావుపై ఆయన పుస్తకాలు రచించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు సంబందించిన రాజకీయాలపై ఆయనకు విశేషమైన పట్టు ఉండేది.

tags : journalist,died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info