ముప్పైనాలుగేళ్లపాటు పశ్చిమబెంగాల్ లో అదికారం చెలాయించిన సిపిఎం పార్టీ ప్రస్తుతం ఆ రాస్ట్రంలోని వివిధ జిల్లాలలో పార్టీ ఆఫీస్ లను మెయిన్ టెన్ చేయడానికి ఇబ్బందులు పడుతోంది. తూర్పు బర్ ద్వాన్ జిల్లాలో ఉన్న ఒక ఆఫీస్ బవనాన్ని సిపిఎం స్థానిక కమిటీ అద్దెకు ఇచ్చింది.స్థానిక నేతలు దగ్గర,దగ్గరగా రెండు ఆపీస్ లు ఉన్నాయని,ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు భరించడం కష్టం గా ఉందని అందుకే అద్దెకు ఇచ్చామని అంటున్నారు.పదిహేను వేల రూపాయలకు అద్దెకు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వ్యాపారి అక్కడ ఉన్న సిపిఎం నేతల బొమ్మలు తొలగించి రెనవోషన్ లో పడ్డారు. tags : cpm,office, rent