A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజీనామాకు గర్వపడుతున్నా-వైసిపి ఎమ్.పి
Share |
February 21 2018, 7:01 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, సమాజానికే హానికరంగా మారారని, అలాంటివారిని సమాజం వెలి వేయాలని లోక్ సభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రత్యేక హోదాకోసం రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నామని, అందుకు గర్వపడుతున్నామని ఆయన అన్నారు. చరిత్రలో తమకు కూడా రెండులైన్లు ఉంటుందని, ఇది గొప్ప విషయం అని ఆయన అన్నారు.చంద్రబాబు ప్రత్యేక హోదాను వదలివేసి, ప్యాకేజీ అంటూ వెళ్లి,అది కూడా రాలేదని ఇప్పుడు చెబుతున్నాడని ఆయన అన్నారు. తాము నాలుగేళ్ల నుంచి చెబుతుంటే వినకుండా తమందరి మీద విమర్శలు చేసి,ఇప్పుడు ఇలా మారాడని ఆయన అన్నారు.పిరాయింపులను ప్రోత్సహించి,అనైతిక రాజకీయాలు చేసి,రాస్ట్రంలో రాజకీయాలనే భ్రష్టు పట్టించాడని మేకపాటి మండిపడ్డారు.తాము పార్లమెంటులో పోరాటం చేసి, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేసి వస్తామని ఆయన ప్రకటించారు.

tags : mekapati, resignation

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info