A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ, చంద్రబాబు పరస్పరం పరువు తీసుకున్నారా!
Share |
January 22 2019, 4:18 am

లోక్ సభలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రత్యేకించి ఎపికి సంబందించిన విభజన సమస్యలు, హామీల గురించి ఆయన ప్రస్తావించకపోగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ ఆవుకధ చెప్పారా అన్న భావన కలుగుతుంది.గత కొద్ది రోజులుగా మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య సాగుతున్న గేమ్ లో భాగంగానే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారా అన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా తన ఎమ్.పిల ద్వారా ప్రదాని మోడీకి అవమానకరమైన రీతిలో నిరసనలు చేయించారు.గతంలో కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాందీకి విపక్ష ఎమ్.పిలతో పాటు సొంత పార్టీ ఎమ్.పిలు చేసిన ఆందోళనలతో అప్రతిష్ట ఎదురైంది.అదే తరహాలో మోడీకి కూడా టిడిపి నుంచి పరాభవం ఎదురైంందన్న భావన కలుగుతుంది.దానిని దృష్టిలో ఉంచుకునే మోడీ మరింత కఠినంగా వ్యవహరించారా?అన్న అబిప్రాయం కలుగుతుంది.సాదారణంగా పార్లమెంటు ,లేదా శాసనసభలలో ప్రతిపక్షాలు, లేదా మిత్ర పక్షాలు ఏదైనా ముఖ్యమైన అంశంపై నిరసనలు చెబితే ప్రదాని లేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవారు ఏదో రూపంలో వివరణ ఇస్తారు.లేదా తన వాదన వినిపస్తారు. కాని మోడీ ఈ రెండూ చేయలేదు.పైగా విభజన కాంగ్రెస్ పాపం అంటూ వారిపైకి నెట్టివేసే యత్నంచేశారు.సంబందం లేని దేశ విభజన గురించి కూడా ఆయన మాట్లాడారు.అంజయ్యను దళితుడిగా తప్పు చెప్పారు. అంజయ్యకు అవమానం జరగడం వల్లే ఎన్.టి.ఆర్.తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని పెట్టారని చెప్పారు.నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి పోటీలో పెట్టి ఆయననే కాంగ్రెస్ ఓడించిందని ఎద్దేవ చేశారు.ఈ సంగతులన్నీ సరే. మరి చంద్రబాబు కేంద్రం నుంచి నిర్దిష్ట జవాబు ఇవ్వాలని కోరారు కదా.దానిపై ఎందుకు ప్రదాని మాట్లాడలేదు. అంతకుముందు రోజు సుజనా చౌదరిని పిలిపించుకుని ఏమని చెప్పారు? కొన్ని పత్రికలలో వచ్చినట్లు మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని మోడీ స్పష్టం చేశారా?అయినా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోతున్నారా?లేక మీ నిరసనలు కొనసాగించుకోండి అని ఉంటారా?అలా అని ఉంటే టిడిపి ఎమ్.పిలు ప్రధాని స్పీచ్ ఆరంభం కాగానే ఎందుకు తమ సీట్లలో కూర్చున్నారు. అమిత్ షా,రాజ్ నాద్ లు చంద్రబాబుకు పోన్ చేసినా ఒప్పుకోలేదని టిడిపి మీడియా పేర్కొన్న తర్వాత ఎమ్.పిలు ఎలా సర్దుకున్నారు?ఇదంతా ఒక గందరోగోళంగా, టిడిపి ఆడుతున్న డ్రామాగా కనిపిస్తుంది.ఆ తర్వాత ఎమ్.పి గల్లా జయదేవ్ మాట్లాడుతూ 29 సార్లు చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని అన్నారు.అంటే తెలుగువారి ఆత్మగౌరవం పుట్టిన పార్టీ ఇంతగా దిగజారి ఆత్మగౌరవాన్ని వదలుకుందని ఆయన చెబుతున్నారు.నిజానికి టిడిపి స్థాపించినప్పుడు చంద్రబాబు కాని జయదేవ్ కుటుంబం కాని కాంగ్రెస్ లో ఉండడం గమనించదగ్గ అంశమే. చంద్రబాబు వైఖరితో మోడీ విసిగిపోయి ఉంటే ఆయన స్వయంగా చెప్పలేకపోయినా, పార్టీ నేతలతోనో, కేంద్రంలోని బిజెపి మంత్రులతోనో ఆ విషయం చెప్పవచ్చు కదా?తాము ఫలానావి చేశామని, ఇన్ని నిదులు ఇచ్చామని ఎందుకు చెప్పించలేదు.అలాగే కేంద్రం నుంచి నిధులు సరిగా రాకపోతే నాలుగు సంవత్సరాల పాటు కేంద్రం సహకరిస్తోందని చంద్రబాబు ఎందుకు చెప్పారు?కేంద్రంతో గొడవ పెట్టుకోనని ఎందుకు అన్నారు?అరుణ్ జైట్లి రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో కొత్త విషయాలు ఏమీ లేకపోయినా, టిడిపి ఎమ్.పి సిఎమ్ రమేష్ స్పష్టత వచ్చిందని ఎందుకు అన్నారు.ఆ తర్వాత మళ్లీ పార్టీ నుంచి డైరెక్షన్ ప్రకారం నిరసన ఎందుకు తెలిపారు.టిడిపి ఎమ్.పిల పోరాటానికి మద్దతుగా ప్రదర్శనలు చేయాలని టిడిపి ఎపి అద్యక్షుడు కళా వెంకటరావు ఎందుకు పిలుపు ఇచ్చారు.ఇవన్ని చూస్తుంటే బిజెపి,టిడిపి సంబందాలు చివరి స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది.చంద్రబాబు ఆత్మగౌరవాన్ని మోడీ దెబ్బ కొట్టినా,మోడీ పరువును చంద్రబాబు బజారులో నిలబెట్టినా మళ్లీ ఇద్దరు కలిసి పొత్తు కొనసాగిస్తుండడమో రాజకీయ విచిత్రంగా ఉంటుంది. నిజంగానే చంద్రబాబు చేసిన అవమానానికి కోపం వస్తే టిడిపి మంత్రులను తొలగించాలి. అలాగే బిజెపి అనండి, ప్రదాని మోడీ అనండి తన పరువు తీశారని చంద్రబాబు భావిస్తుంటే బిజెపి మంత్రులను ఈయన తొలగించాలి.ఇద్దరూ అలా చేయడం లేదు. ఒకరి పరువు ఒకరు తీసుకుంటూ రాజకీయాలను దిగజార్చుతున్న ఘనత మాత్రం ఇద్దరికి సొంతం అవుతుందని అనుకోవాలి.(గ్రేట్ ఆంద్రలో ప్రచురితం)

tags : modi, babu, prestiege

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info