A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అనుకూల వాదిగా జెపి మారారా!
Share |
February 21 2018, 7:00 pm

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల లైన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?కేంద్రం ఇచ్చిన నిదులు, రాష్ట్రం చేసిన ఖర్చు, కేంద్ర వాదన, రాష్ట్రాల వాదనపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్,జెపి వంటి వారితో కలిపి కమిటీ గా ఏర్పాటు చేస్తున్నానని చెబుతున్న సంగతి తెలిసిందే. ఉండవల్లి, జెపి, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ లు ఈ నేపద్యంలో సమావేశం జరిపారు. ఆ తర్వాత జెపి మీడియా తో మాట్లాడిన విషయాలపై వచ్చిన వార్తలు చూస్తే ఆయన చంద్రబాబు అనుకూల లైన్ తీసుకున్నారా అన్న భావన వచ్చే అవకాశం ఉంది.'జేపీ మాట్లాడుతూ.. మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇప్పటివరకు ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని విమర్శించారు" అని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాలో రిపోర్టు అయింది. ముందుగానే జెపి ఈ అబిప్రాయానికి రావచ్చా అన్న ప్రశ్న వస్తుంది.పైగా కొద్ది రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లిన తర్వాత మాట్లాడిన విషయాలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. యుటిలైజేషన్ సర్టిపికెట్లు, ఇతర సాంకేతిక విషయాలు పట్టించుకోరాదని ఆయన అనడం ఆశ్చర్యమే. ప్రభుత్వాలు నిదులను వాటి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చని మాజీ ఐఎఎస్ అయిన జెపి అంటున్నారా?అన్న బావన ఏర్పడుతుంది.అందువల్ల ఆయన చంద్రబాబు అనుకూలవాదిగా మారారా అన్న డౌట్ రావడానికి ఆస్కారం ఏర్పడింది.

tags : jp, chandrababu,

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info