A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణ
Share |
August 21 2018, 9:50 pm

ముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అస్సైన్డ్ భూములకు సంబందించి ప్రభుత్వం తీసుకు రాదలచిన ఆర్డినెన్స్ పై ఆయన స్పందించారు.. అసైన్డ్‌ భూములను అస్మదీయులకు దోచిపెట్టాలని, తన సమీప బంధువైన మైహోం సిమెంట్స్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బాగోతానికి సీఎం తెరలేపారని ఆయన ఆరోపించారు.అసెంబ్లీలో దీనిపై చర్చించకుండా హడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను సీఎం కేసీఆర్‌పైనే ఆరోపణలు చేస్తున్నానని, కావాలంటే తనపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. సీఎం బినామీ అయిన రామేశ్వర్‌రావు, ఆయన బంధువులు శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి తదితర పది గ్రామాల్లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల భూములను సేకరించారని, ఇందులో 1,500 నుంచి 2,000 ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయని రేవంత్‌ ఆరోపించారు.వేల ఎకరాలను రామేశ్వర్‌రావుకు బదిలీ చేయడానికి, సీఎం బంధువైన కలెక్టర్‌ ద్వారా కేసీఆర్‌ దోపిడీకి పాల్పడుతున్నారని, హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల విషయంలో సహాయ నిరాకరణ చేసినందుకే ఐఏఎస్‌ అధికారి బి.ఆర్‌.మీనాను ఉన్నపళంగా బదిలీ చేశారని ఆరోపించారు.

tags : c,m.revanth,allegation

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info