ఎపి శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలా?వద్దా అన్నదానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఒంగోలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి వైవి సుబ్బారెడ్డి చెప్పారు.నరసాపుంరలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఓ వ్యాపారంలా పెట్టుకుందని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేసిందని ఆరోపించారు. కేంద్రంపై నమ్మకం లేనప్పుడు టీడీపీ ఎంపీలు కేబినెట్లో మంత్రులుగా ఎందుకు కొనసాగుతున్నారని సుబ్బారెడ్డి సూటిగా ప్రశ్నించారు. tags : ysr congress, assembly