A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాళేశ్వరానికి మేధావుల బృందం
Share |
August 21 2018, 9:49 pm

కాళేశ్వరం ప్రాజెక్టుతోనే బంగారు తెలంగాణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రొఫెసర్ల బృందం వ్యాఖ్యానించింది.పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్ లు రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన బ్యారేజీ లు,పంప్ హౌజ్ లు,టన్నెల్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ ప్రాజెక్టు లో ప్రతి చోటా పనులన్నీ ఒక ఉద్యమం వలె జరుగుతున్నట్టు ప్రొఫెసర్ ల బృంద సారధి ఘంటా చక్రపాణి చెప్పారు. రెండు రోజుల పాటు కాళేశ్వరం పర్యటనలో ఊహకు అందని విజ్ఞానం
కనిపించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇంజనీర్ల అబ్బురపరిచే ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో ఉందన్నారు.నాగార్జున సాగర్ వంటి మానవ నిర్మిత అద్భుత ప్రాజెక్టు నిర్మాణానికి 40 సంవత్సరాలు పట్టిందని,కానీ కాళేశ్వరం ప్రాజెక్టు 40 నెలల్లో పూర్తవుతున్నదని ఘంటా చెప్పారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న తీరు, వేగం, ఇంజనీర్ల నైపుణ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని ప్రొఫెసర్ చక్రపాణి తెలిపారు. తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగునీరు, ప్రతి చెరువు,ప్రతి కుంటకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు గురించి
మాటల్లో వర్ణించలేమని టి.ఎస్.పి.ఎస్.సి.చైర్మన్ అన్నారు. తెలంగాణ భవిష్యత్ చిత్రపటం రూపు రేఖలు సమస్తం మారబోతోన్నట్టు చక్రపాణి చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, మంత్రి హరీశ్ రావు పర్యవేక్షణతో ఇంజనీర్ల శ్రమ తెలంగాణ పునర్నిర్మానానికి ప్రాణం పోస్తున్నదని ఘంటా చక్రపాణి తెలిపారు.రీ డిజైన్, గోదావరి
రివర్స్ పంపింగ్ విధానం అద్భుతమని అన్నారు. గోదావరి నీటిని 30 మీటర్ల కింది నుంచి పారే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు లో రివర్స్ పంపింగ్ ద్వారా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు 140 మీటర్ల ఎత్తునకు
పారించడం తమనుసంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని ప్రొఫెసర్ల బృందం అభిప్రాయ పడింది.

tags : kaleswaram, intellecturals

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info