A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక హోదాపై వైసిపి ఉద్యమం
Share |
February 23 2019, 11:51 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై మళ్లీ ఆందోళన బాట పట్టింది. ఈ మేరకు ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.పార్టీ ముఖ్య నిర్ణయంగా వచ్చే నెల 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు అనే నినాదంతో ధర్నాలు చేయాలని నిర్ణయించాం అని పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. మార్చి 5వ తేదీన ‘ప్రత్యేక హోదా మన హక్కు- ప్యాకేజి మాకొద్దు’ అన్న నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలసి ధర్నా చేస్తాం అని ఆయన తెలిపారు.ప్రత్యేక హోదా సంజీవని అని, దాని వల్ల రాష్ట్ర ప్రజానీకానికి ఎనలేని ప్రయోజనాలు ఒనగూరుతాయని చెప్పింది ఒక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే అని ఆయన అన్నారు.

tags : bhumana, specialstatus

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info