A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి కనుమరుగవుతుంది..టిడిపి హెచ్చరిక
Share |
February 21 2018, 7:02 pm

ఎపిలో బిజెపి కూడా కనుమరుగైపోతుందని టిడిపి ఎమ్.పి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసి కనిపించకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు.
విభజన చట్టంలోని 19 అంశాలపై స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఎన్ని సార్లు దిల్లీ గడప తొక్కాలన్న ఉద్దేశంతోనే పోరాటం ప్రారంభించాం. ఈ పోరాటంలో వెనుదిరిగే పరిస్థితి లేదు. విభజన చట్టంలోని అంశాల్నిఎప్పటిలోగా నెరవేరుస్తారన్న స్పష్టత కావాలని ఆయన అన్నారు.కాగా గుంటూరు ఎమ్.పి గల్లా జయదేవ్ మాట్లాడుతూతమకు మద్దతుగా వివిధ పార్టీలు గళం కలుపుతున్నాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూశాక భాజపాను నమ్మొచ్చా? ఆ పార్టీతో మైత్రి మంచిదేనా? మనల్నీ మోసం చేస్తారా? అన్న అనుమానం మిగిలినవారిలోనూ ఉంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని కేంద్రం ఎలా అమలుచేస్తుందా? అని దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. అన్నారు.

tags : tdp, warning

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info