A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డబుల్ టాక్ ఎవరిది..చంద్రబాబుదా..జగన్ దా
Share |
November 18 2018, 6:06 am

తెలుగుదేశం నేతలు తమాషా ఆరోపణలు చేస్తుంటారు. బిజెపి నేత సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబును అవినీతికి వారసుడని, రెండు ఎకరాల వ్యక్తి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని, కేంద్రం పంపుతున్న డబ్బు అవినీతి పాలు అవుతోందని అంటుంటే ఆయనకు సమాదానం చెప్పకుండా ఆ సమస్య ను అంతటిని విపక్ష నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై పెట్టే యత్నం చేస్తున్నారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని,డబుల్ గేమ్ ఆడుతున్నారని మంత్రి కాల్వ శ్రినివాస్ కాని మరికొందరు టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసలు సమస్య ఏమిటి?టిడిపి చేస్తున్నది ఏమిటి.మొన్నటి దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు? తాను కేంద్రంతో గొడవ పెట్టుకోనని, సఖ్యతగా ఉండి రాష్ట్రానికి అవసరమైనవి సాధించుకుంటున్నామని చెప్పారా?లేదా?పైగా జగన్ ,విపక్షాలు కేంద్రానికి తమకు మద్య గొడవలు పెడుతున్నాయని ఆరోపించారా?లేదా?ఇప్పుడేమో తాము పోరాడుతున్నామని,కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని చెబుతారా? రాజీలేని పోరాటం అంటే తమ ఎమ్.పిలను కేంద్ర మంత్రులుగా కొనసాగించడమా?కేంద్రం ఎన్ని నిదులు ఇవ్వాలి? ఎంత ఇచ్చింది?కేంద్రం ఇచ్చిన నిధులను వేటికి ఖర్చు చేశారు? వాటికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపించారా?లేదా ఇలాంటివాటిని సవివరంగా ప్రజలకు తెలియచేస్తూ ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదు? బిజెపిని ,ప్రధాని మోడీని అప్రతిష్టపాలు చేయడం వరకు చంద్రబాబు సఫలం అయినట్లే కనిపిస్తుంది.అదే సమయంలో బిజెపి నేత సోము వీర్రాజు కూడా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని బాగానే గబ్బు పట్టించారు.అయితే తెలుగుదేశం పార్టీ మద్యలో జగన్ ప్రసావన తేవడం, వీర్రాజు వైసిపి ఏజెంట్ అని అనడం ఆశ్చర్యంగానే ఉంటుంది. బిజెపిని టిడిపి విమర్శించింది కాబట్టి చంద్రబాబు కాని, తెలుగుదేశం పార్టీకాని కాంగ్రెస్ ఏజెంట్లు అవుతున్నారా?కేంద్రం ఈ ఏడాది వివిధ పద్దుల కింద 31 వేల కోట్లు ఇచ్చిందని బిజెపి నేతలు చెబుతున్నారు.అది వాస్తవమా?కాదో టిడిపిఎందుకు చెప్పదు?కొద్ది నెలల క్రితం కూడా కేంద్రం బాగానే సహకారం అందిస్తోందని ఎందుకు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు నాలుగేళ్ళు పూర్తి అయ్యాక, తాము ఐదో బడ్జెట్ లో అయినా న్యాయం జరుగుతుందని భావించామని కాకమ్మ కద ఎందుకు చెబుతున్నారు?ఇది డబుల్ టాక్ కాదా?డబుల్ గేమ్ కాదా.నిజానికి డబుల్ టాక్ లో కాని, డబుల్ గేమ్ లో కాని చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతుంది.1998 కి ముందు బిజెపి మతతత్వ పార్టీ,మసీదులు కూల్చే పార్టీ అని చంద్రబాబు విమర్శించేవారు.ఆ తర్వాత వాజ్ పేయి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి యునైటెడ్ ప్రంట్ కే ఎసరు పెట్టారు. మద్య నిషేధం, రెండు రూపాలయకు కిలో బియ్యం వంటి పదకాల విషయాలలో అప్పట్లో చంద్రబాబు ఏమి చెప్పింది,ఆ తర్వాత ఏమి చేసింది వేరే వివరించనవసరం లేదు.గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని నరహంతకుడని, ఆయనను పదవి నుంచి దించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మోడీని ఆశ్రయం పొందడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది చరిత్రలో రికార్డు అయ్యే ఉంది కదా?ఇక ప్రత్యేక హోదా అంశంలో పదిహేను ఏళ్లు కావాలని కోరడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం, తదుపరి ప్రత్యేక హోదా అవసరం లేదు..ప్యాకేజీ ఇవ్వడమే బెటర్ అనడం ,అదేమైనా సంజీవనియా అనడం ఇలా ఎన్నో ఉదంతాలు డబుల్ టాక్ కు,డబుల్ గేమ్ కు నిలువుటద్దంగా కనిపిస్తాయి.మరి జగన్ ప్రత్యేక హోదా మీద మాట మార్చారా?ప్రత్యేక హోదా ప్రదర్శనకు విశాఖ వెళ్ళిన జగన్ ను విమానాశ్రయంలో నే చంద్రబాబు ఎందుకు అరెస్టు చేయించారు. పిరాయింపుల రాజకీయాలపై జగన్ మాట మార్చారా?చివరికి ప్రతిపక్షంలో ఉండి కూడా తన పార్టీలో చేరాంటే రాజీనామా చేయించారే.మరి చంద్రబాబు మొదట పశువుల సంతలో మాదిరి తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని అన్నారే. ఆ తర్వాత ఎపిలో వైసిపి ఎమ్మెల్యేలను పశువుల మాదిరి ఆయనే కొన్నారే. నిజానికి డబుల్ టాక్ చేసి ఉంటే జగన్ ఇప్పటికే అదికారంలో ఉండేవారు కదా?ఇన్ని కష్టాలు పడవలసి వచ్చేదా?నిజమే డబుల్ గేమ్ ఆడేవాళ్లకు అదికారం, అలా చేయని వాళ్లకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎల్లకాలం అలా ఉండదు.కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారిపోయిందే అన్న బాద ఆ పార్టీ అబిమానులకు మిగులుతోంది.

tags : ap,doluble game

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info