A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో పదుపాయాలతో కొత్తగా బస్టాప్ లు
Share |
August 21 2018, 9:48 pm

నగరంలో ఎర్పాటు చేయనున్న నూతన బస్టాపుల పైన పురపాలక శాఖ కెటి రామారావు
సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరగిన ఈ సమీక్ష సమావేశంలో
జియచ్ యంసి కమీషనర్ జనార్ధన రెడ్డి, అడిషనల్ కమీషనర్ అద్వైత్ కూమార్,
వర్కింగ్ ఎజెన్సీలున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్టాప్లకు కన్నా అత్యుత్తమ
డిజైన్లు, సౌకర్యాలతో కూడిన వాటిని ఎర్పాటు చేసేందుకు జియచ్ యంసి ఇప్పటికే
టెండర్లు పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. సుమారు 800కు పైగా నూతనంగా
బస్టాప్లు నగరంలో ఎర్పడనున్నయాని అధికారులు మంత్రికి తెలియజేశారు. వాటిలో
ఉన్న సౌకర్యాల ప్రకారం ఏ.బి.సి గ్రెడ్లుగా విభజించి నిర్మాణాలు చేస్తున్నట్లు
తెలిపారు. అయితే అన్ని సౌకర్యాలున్న ఎ గ్రేడ్ బస్టాపుల సంఖ్యను మరింత
పెంచాలని మంత్రి జియచ్ యంసి కమీషనర్ కు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న
సంఖ్యను రెట్టింపు చేయాలని, ఈ మేరకు వర్కింగ్ ఎజెన్సీలకు బస్టాపుల
నిర్మాణానికి స్ధలాలను అందజేయాలన్నారు. బస్టాపుల నిర్మాణంలో ఉన్న
క్షేత్రస్ధాయి సమస్యలను పరిష్కారించేందుకు అడిషనల్ కమీషనర్ అద్వైత్
కూమార్ క్షేత్రస్ధాయిలో పర్యటించాలని అదేశారు జారీ చేశారు. ఎట్టి
పరిస్ధితుల్లో మార్చి మాసాంతానికి బస్టాపుల నిర్మానం పూర్తి చేయాలని
అదేశించారు. రోడ్డును అనుకొని ఉన్న ప్రభుత్వ సంస్ధలు, కార్యాలయాలతో
చర్చించి అయా ప్రాంతాల్లో బస్సు బేలను ఎర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అయా
ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో వచ్చే వారం ఒక సమావేశాన్నిఎర్పాటు చేస్తామని
మంత్రి తెలిపారు. మెట్రో కారిడార్లలో బస్టాపుల ఎర్పాటు కోసం మెట్రో రైలు
యండితో సమన్వయం చేసుకోవాలని మంత్రి జియచ్ యంసి అధికారులకు తెలియజేశారు.
గడువులోగా పనుల పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టు రద్దు చేసేందుకు
వెనకాడబోమని మంత్రి వర్కింగ్ ఎజెన్సీలకు మంత్రి తెలిపారు.

tags : hyderabad, bus stops

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info