కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలు సంఘటితమై పోరాడాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ అద్యక్షుడు మౌలానా రాబె హసనీ నద్వి అన్నారు.రాజ్యంగం ఇచ్చిన హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన అన్నారు.
ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో ఈ సమావేశం జరిగింది.ముస్లింల ధార్మిక, షరియత్ హక్కులను మార్చడానికి కేంద్రం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను ముస్లిం సముదాయం తిప్పికొట్టాలన్నారు. కేంద్ర వైఖరిపై ముస్లిం సమాజం, ముస్లిం సంస్థలు, బోర్డులు మౌనం పాటించడం సరికాదన్నారు.దేశంలో రోజురోజుకు మతతత్వం పెరిగిపోతోందని బోర్డు కార్యదర్శి వలీ రహ్మాని అన్నారు. tags : muslims, modi