A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడపలో ఆమరణ దీక్ష భగ్నం
Share |
November 18 2018, 4:47 am

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.ఆ జిల్లాలలో ఆందోళనలు సాగుతున్నాయి.నిరాహార దీక్షలు, ఇతరత్రా నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. కడప జిల్లా కోర్టు ఎదుట సీనియర్‌ న్యాయవాది మలిశెట్టి నాగరాజు ఆరు రోజుల నుంచి చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరంలో నాగరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.నాగరాజు సొమ్మసిల్లి పడిపోగా, వైద్య బృందం ఇచ్చిన రిపోర్టు మేరకు నాగరాజును శనివారం సాయంత్రం అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేయగా న్యాయవాదులు అడ్డుకోబోయారు. బలవంతంగా నాగరాజును ఆస్పత్రికి తరలించారు.

tags : ap, fast,kadpa,lawyer

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info