A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి, టిడిపిలలో ఏది అబదద్దం-పవన్ కళ్యాణ్
Share |
February 23 2019, 12:25 pm

ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న రాష్ట్రంలో ప్రతి చిన్న విషయం లో గొడవ పెడితే ఇబ్బందులు వస్తాయని తాను ఇంతకాలం పెద్దగా మాట్లాడలేదని జనసేన నేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హకదా ఇవ్వకపోవడంపై తనకు బాద ఉందని అన్నారు. గత ఎన్నికలలో తాను కూడా బాద్యత తసీఉకుని ప్రచారం చేశానని అన్నారు. కేంద్రం ఇచ్చినట్లు చెబుతున్నవాటిలో క్లారిటీ రాలేదని ఆయన అన్నారు.రాష్ట్రం నుంచి కాని, కేంద్రం నుంచి స్పష్టత ఇవ్వడం లేదని ,ఇదంతా గందరగోళంగా మారిందని అన్నారు. రాష్ట్రం ఇప్పుడు చెబుతుండడంపై కూడా తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. పోలవరం పై శ్వేతపత్రం అడిగానని, కాని ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న తనకే వివరాలు ఇవ్వనప్పుడు మిగిలిన విషయాలు అడిగితే మాత్రం ఇస్తారా అని ఆయన అన్నారు. మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ తో కలిసి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు వారితో కలిసి పనిచేశానని, అందువల్ల బాత్యత తీసుకుని, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి అరుణ కుమార్ వంటివారితో మాట్లాడాలని కోరుకున్నానని ఆయన అన్నారు.ఆయన న్యూట్రల్ గా చూడగలరనే ఉద్దేశంతో మాట్లాడానని ఆయన చెప్పారు.జెపి ఉండవల్లి ఇతర మేధావులు కలిసి ఉండే కమిటీ కేంద్రం ఎంత ఇచ్చిందన్న వివరాలు పరిశీలించి వాస్తవాలు చెప్పాలన్నది తన ఉద్దేశం అని అన్నారు.బిజెపి,టిడిపిలలో ఎవరో ఒకరు అబద్దాలు ఆడుతున్నారని,తాను మాట్లాడితే బిన్నంగా ఉంటుందని,అందువల్ల మద్యస్తంగా ఉండేవారితో కమిటీ వేయాలన్నది తన కోరిక అని పవన్ కళ్యాణ్ అన్నారు.

tags : pawankalyan, white papter

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info