A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ వ్యాఖ్యలపై కెవిపి కౌంటర్
Share |
August 21 2018, 9:49 pm

కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులకు,ప్రముఖులకు పార్టీలో అన్యాయం జరిగిందంటూ ప్రదాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు తిప్పికొట్టారు. ప్రధాని మోడీకి ఈ విషయం ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని ఆయన ఎద్దేవ చేశారు.మోడీ కాంగ్రెస్ పై అసత్యాలు మాట్లాడారని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను అవమానించిందని మోడీ చెప్పడం శుద్ద అబద్దమని ఆయన అన్నారు. అంజయ్యని కాంగ్రెస్ చాలా అవమానించిందని మోదీ చెబుతున్నారని, లక్ష రూపాయల సూట్, కళ్ల అద్దాలు పెట్టుకుని అంజయ్య ఎప్పుడూ లేరని కెవిపి వ్యాఖ్యానించారు.అంజయ్య మామూలు కూలీగా, సామాన్యుడిగా బ్రతికేవారని అన్నారు. అంజయ్య 1957 నుంచి చనిపోయేంత వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. ఆయనకి కుల బలం లేదని, కానీ ప్రజాబలం ఉందని వ్యాఖ్యానించారు. అంజయ్య చనిపోయాక కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందన్నారు.
పీవీ నరసింహారావు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారని ,ఆయన కాంగ్రెస్ లోనే వివిధ పదవులు చేపట్టారని, చివరికి ప్రదాని అయ్యారని కెవిపి అన్నారు. అద్వానీకి మనకంటే ఎక్కువ మోదీ గురించి ఎక్కువ తెలుసునని, అలాంటి ఆయనను బొటన వేలితో తొక్కి పెట్టారని ఆరోపించారు. అద్వానీ మీద సీబీఐ కేసు పెట్టి ఈ వయసులో కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అద్వానీ ఆ రోజు చేపట్టిన పనుల వల్లే బీజేపీకి జవసత్వాలు వచ్చాయని గుర్తు చేశారు.

tags : kvp, modi, counter

Latest News
*టీవీ9 సేల్ కంప్లీట్..డీల్ విలువ 500 కోట్లు!
*మోడీకి-రాహుల్ కు చాలా తేడా-సర్వే
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*కాంగ్రెస్ పై చంద్రబాబు లీకులు
*బోగాపురం టెండర్ -సిబిఐ విచారణ చేస్తుందా
*కేరళకు 700 కోట్ల సాయం-యుఎఇ
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info