A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళలే బీరు తాగకూడదా -నెటిజన్ల ప్రశ్న
Share |
November 18 2018, 5:13 am

యువతులు బీరు తాగుతుంటే తనకు భయం వేస్తోందన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అమ్మాయిలు తాగకూడదు. అబ్బాయిలు తాగవచ్చా అని కొందరు.వీటి గురించి చెప్పే సి.ఎమ్.కు మహిళలు పోర్న్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని తెలిస్తే నెలల తరబడి నిద్రపోరా అని ఒకరు వ్యాఖ్యానించారట. ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు... వీరా మన పాలకులు అంటూ...పలువురు నెటిజన్లు తమ అబిప్రాయాలను వెలిబుచ్చారట. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' హ్యాష్‌ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు.అంతేకాదు..ఒక యువతిని 8 నెలలపాటు అత్యాచారానికి గురిచేసిన ఘటన గురించి పారికర్ కు తెలియదా?పట్టపగలు బస్ లలో మహిళలను వేదిస్తున్న సంగతేమిటి?అని వారు సి.ఎమ్.ను ప్రశ్నిస్తున్నారు. మనోహర్ పారికర్ ఏ ఉద్దేశంతో అన్నా, ఆయన కేవలం మహిళలను ఉద్దేశించి అనడంపై ఆక్షేఫణ వస్తున్నది.

tags : goa, women,beer

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info