A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిని బాగా తిట్టారు..ఎమ్.పికి టిడిపి సన్మానం
Share |
November 18 2018, 5:15 am

తెలుగుదేశం పార్టీ కొత్త ట్రెండ్ పెడుతున్నట్లుగా ఉంది.గుంటూరు ఎమ్.పి గల్లా జయదేవ్ పార్లమెంటులో బాగా మాట్లాడారని టిడిపి వారు సన్మానం చేస్తున్నారట. తెలుగుదేశం మీడియా తెగ సంబర పడుతోంది. సాధారణంగా మీడియాలో ఏ రోజు వార్తలనే మొదటి పేజీలో వేస్తుంటారు. కాని చిత్రంగా ఒక పెద్ద పేపర్ గల్లా జయదేవ్ ప్రసంగం అంటూ రెండు రోజుల తర్వాత మొదటి పేజీలో ప్రచురించింది. ఇదంతా మీడియా మేనేజ్ మెంట్ లో భాగమా అన్న సందేహం వస్తుంది.జయదేవ్ బాగా మాట్లాడితే అబినందించవచ్చు.కాని ఇంత హడావుడి చేయడం ఆశ్చర్యమే. ఇంతకీ ఎందుకు సన్మానం అంటే బిజెపిని బాగా ఎండగట్టేశారట.అందుకే ఈ సన్మానమని టిడిపి మీడియా చాలా సంతోషంగా తెలిపింది. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి గత నాలుగేళ్లగా ఏవిధంగా అన్యాయం చేస్తూ వచ్చిందీ, న్యాయం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా 29 పర్యాయాలు దిల్లీ వచ్చి విజ్ఞాపనలు అందజేస్తే స్పందించక పోవడాన్ని ఆయన లోక్‌సభలో జరిగిన చర్చలో ఎండగట్టడంతో పాటు అక్కడ అన్ని రాజకీయ పక్షాలకు తెలియజెప్పారని టీడిపి మీడియా వ్యాఖ్యానించింది. 29 పర్యాయాలు డిల్లీకి ఒక ముఖ్యమంత్రి వెళ్లినా పని జరగలేదని అనడం పరువు తక్కువగా వారు తీసుకోవడం లేదు. మిత్రపక్షంగా ఉన్న బిజెపిని బాగా విమర్శిస్తే సన్మానం చేస్తారన్నమాట.ఎపిలో తమాషా రాజకీయాలే సాగుతున్నాయా!

tags : galla, bjp,tdp, honour

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info