A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇంటి వద్ద లాయర్ల ఆందోళన
Share |
February 21 2018, 7:02 pm

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద లాయర్లు ఆందోళనకు దిగారు.గత కొంతకాలంగా ఈ డిమాండ్ తో లాయర్లు రాయలసీమలో ఆందోళనలు చస్తున్నారు. శనివారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద నిరసన తెలిపారు.ముఖ్యమంత్రిని కలిసి వారు వినతిపత్రం ఇవ్వాలని భావించారు.కాని పోలీసులు అందుకు అనుమతించలేదు.దాంతో వారు అక్కడకు సమీపంలోని రహదారిపై నిలబడి నినాదాలు చేశారు. హైకోర్టు అమరావతిలో వద్దు.. రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనను తెలిపారు.ఆంద్రప్రదేశ్ అంటే ఒక్క అమరావతేనా అని వారు ప్రశ్నించారు.చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో హైకోర్టు ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదని, కాని రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 1937 నవంబర్ 16 శ్రీబాగ్ ఒడంబడికలో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరిగిందని వారు గుర్తు చేశారు.

tags : high court, agitation

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info