A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ వ్యతిరేకిని -ప్రకాష్ రాజ్
Share |
February 21 2018, 7:03 pm

తాను ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిని కాని, హిందూ వ్యతిరేకిని కానని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు.బెంగుళూరులో జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య జరిగిన తర్వాత కొందరు సంబరాలు జరుపుకున్నారని , వారంతా మోడీ అబిమానులని తెలిసిందని ఆయన అన్నారు. ఇండియా టుడే టీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.తాను బీజేపీకి ఓటు వేశానా లేదా అన్నది అనవసరం అని, మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నది నిజం అని ఆయన అన్నారు. మరి దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరెందుకు? ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ‘నువ్వు హిందూ వ్యతిరేకివి’ అని విమర్శిస్తారు. నిజానికి నేను హిందూ వ్యతిరేకిని కాను. మోదీ వ్యతిరేకిని. అమిత్‌ షా వ్యతిరేకిని. అనంతకుమార్‌ హెగ్డేకి వ్యతిరేకిని అని ఆయన స్పష్టం చసశారు. పద్మావతి సినిమాపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేనప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉండి మాత్రం ఏం లాభం? వెంటనే దిగిపోతే ప్రజలకు మంచిది’’ అని ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యానించారు.

tags : prakash raj, modi,opponent

Latest News
*కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర,పాదయాత్రలు
*జియో ద్వారా లక్ష ఉద్యోగాలు
*పవన్ అవిశ్వాసం అయితే ఓకే-టిడిపి మంత్రి
*టిడిపి,బిజెపి మంత్రులు నాటకాలు ఆడుతున్నారు
*కమల్ హసన్ రాజకీయ యాత్ర ఆరంభం
*ఆడిటర్లు ఏమి చేస్తున్నారు-జైట్లి ప్రశ్న
*హైదరాబాద్ ఆస్తుల్ని అమ్ముతున్న ఎపి ప్రభుత్వం
*అధికారం ఉంటే కళ్లు నెత్తికెక్కుతాయి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info