కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా టిడిపి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎపి ముఖ్యమంత్రి చంద్రాబుపై తన అబిమానాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది. ఆయన ఒక ప్రకటన చేశారట. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను, ఎపిలో విపక్ష నేత జగన్ ను వ్యతిరేకించే శక్తులు అన్ని ఒకటి కావాలని ఆయన అన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.టిడిపి నేత మోత్కపల్లి నరసింహులు టిఆర్ఎస్ లో టిడిపి విలీనం చేయాలని వ్యాఖ్యానించిన తర్వాత రేవంత్ మాట్లాడుతూ ఈ అబిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టిడిపి పుట్టిందన్న వాదనకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. టిడిపి నాయకులు టిఆర్ఎస్ లోకి వెళ్లినా, బిసి, ఎస్సి నాయకులు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ అన్నారు. ఎక్కడైనా ప్రతిపక్షం అంతా ఒకటి అవ్వాలంటారు.కాని రేవంత్ మాత్రం ఎపిలో ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆయా పక్షాలు ఒకటి అవ్వాలని అంటున్నారు. ఆ మాట ఎపి కాంగ్రెస్ నాయకులకు, రాహుల్ గాందీకి కూడా చెబుతారా?చంద్రబాబు పట్ల ఎంత స్వామి భక్తి! tags : revanth, jagan, chandrababu