A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెక్రటేరియట్ కు రారు..రాజ్ భవన్ కు వెళతారా
Share |
January 18 2018, 5:31 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో, గవర్నర్ ను కలవడానికి రాజ్ భవన్ కు ఎన్నిసార్లు వెళ్లారో చెప్పాలని తెలంగాణ శాసనసభలో బిజెపి నేత జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు.ఇందుకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరుతున్నట్టు తెలిపారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో కొందరు కళ్లు తెరవటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఉద్యమకారులను వేధించిన వారు ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించటాన్ని స్వాగతిస్తున్నట్టు కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కోదండరాంను రకరకాల కారణాలతో అరెస్టు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి మంద కృష్ణ మాదిగ, టీడీపీ నేత ఒంటేరు ప్రతాపరెడ్డిని అరెస్టు చేసిందని ఆరోపించారు.

tags : kisanreddy, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info