A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో వీదేశీ భవనం
Share |
June 20 2018, 10:53 pm

ఏన్నారై శాఖ పైన మంత్రులు కేటీ రామారావు మరియు నాయిని నరసింహారెడ్డిలు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పోలీస్, హోం, ఏన్నారై శాఖల అధికారులు పాల్గోన్నారు. గత వారంలో డిల్లీలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి అద్యర్యంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను, రాష్ర్ట స్ధాయిలో అమలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించబడినది. బతుకు దెరువుకోసం వీదేశాలకు వెళ్లేవారిని మోసం
చేస్తున్న నకీలీ గల్ప్ ఏజెంట్ల పైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నకీలీ ఎజెంట్లపైన గట్టి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను మంత్రులు అదేశించారు. E migrate లో రిజిస్టర్చేసుకునేందుకు ఎజెంట్లకు నెలరోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల్లోగా నమోదు చేసుకోని
వారందరినీ అక్రమ ఏజెంట్లుగా గుర్తిస్తామని మంత్రులు తెలిపారు. రిజిస్టర్ చేసుకోని అక్రమ ఏజెంట్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ హెచ్చరికలు ఖాతారు చేయకుండా పదేపదే వీసాల మోసాలకు పాల్పడే నకీలీ ఎజెంట్లకు పైన పిడి పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పాల్గోన్న డిజిపి ఈ నకీలీ ఎజెంట్లపైన
చర్యలు తీసుకుటుంటామని, ఇందుకు సంభదించి త్వరలోనే మార్గదర్మకాలు జారీ చేస్తామని తెలిపారు. అక్రమ ఎజెంట్ల పైన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని మంత్రులు విజ్ఝప్తి చేశారు. సురక్షితంగా వెళ్లండి, సుశిక్షితులై వెళ్లండి అనే కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నినాదానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ టామ్
కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలన్నారు. దీంతోపాటు రాష్ర్టంలో ఉన్న రిజిస్టర్డ్ ఎజెంట్ల ద్వారానే వెళ్లాలని మంత్రులు కోరారు. హైదరాబాద్ లో విదేశీ భవన్ కు ఫిబ్రవరి రెండోవారంలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలుతీసుకోవాలన్న మంత్రులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఏన్నారై శాఖాధికారులకు అదేశాలు జారీ చేశారు. కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారైలకు, వసల కార్మికులకోసం చేపడుతున్న చర్యలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిసేలాప్రచారం చేయాలని మంత్రి కెటి రామారావు తెలిపారు. గల్ప్ దేశాలకు జరుగుతున్న మహిళల అక్రమరవాణా,మోసపూరిత వివాహాలపైన మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రాష్ర్ట పోలీసు శాఖగతకొంత కాలంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. ఇలాంటి మానవ అక్రమ రవాణాను
అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్నారై శాఖ, పోలీస్ శాఖలు ఉమ్మడి సంయుక్త సమన్వయ
బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక్కడ పోలీసుల చర్యలతో ముంబాయి, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి ఈ
ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపధ్యంలో అయా రాష్ట్రాల అధికారుల సహాకారం తీసుకోవాలని సూచించారు. ఈ
మానవ అక్రమ రవాణకు పాల్పడుతున్న ఏజెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఈ మేరకు పాస్ పోర్టు కార్యాలయ
అధికారుల సహాకారం తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, ఏన్నారై, పోలీసు
శాఖాధికారులు పాల్గోన్నారు.

tags : ktr,hyderabad

Latest News
*మళ్లీ ప్యాకేజీ డబ్బులు అడిగిన చంద్రబాబు
*లోకేష్ మళ్లీ నవ్వులపాలయ్యారా
*జగన్ గ్రాఫ్ పెరుగుతోంది- దగ్గుబాటి
*అమెరికాలో తెలుగు సెక్స్ రాకెట్- సంచలనాలు
*లైసెన్స్ తుపాకీ ఇవ్వాలని కోరిన క్రికెటర్ భార్య
*ఆగస్టు నాటికి పట్టణాలలో మిషన్ భగీరధ
*బ్యాంకుల్లో సొమ్ము భద్రమే.ప్రైవేటులోనే డౌటు
*టిడిపికి కొత్త చిక్కు తెచ్చిన సర్వే-గంటా అలక
*కులాల రిజర్వేషన్ లపై కమిషన్ -ఎపి కొత్త అంకం
*వచ్చే ఎన్నికలలో అన్ని చోట్ల బిజెపి పోటీ- విష్ణురాజు
*కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం
*హైకోర్టుపై ఎపి ఇంకా స్పష్టత ఇవ్వలేదా
*రైతు బందు డబ్బుతో ప్రిజ్ లు, కుక్కర్లు
*ఆంద్రులకు అవమానం మిగిల్చిన చంద్రబాబు
*స్టీల్ ప్యాక్టరీ రాకుండా చేసిందే చంద్రబాబు
*టిడిపి అడ్డగోలు ఫిర్యాదు
*అనంతలో వైసిపి దీక్ష- చంద్రబాబుకు చెక్
*రమణ దీక్షితులపై వంద కోట్ల దావా
*చంద్రబాబే నీటిని వదలాలా...
*పవన్ పోరాట యాత్ర బ్రేకు ఎంతకాలం
*డాలస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
*సంక్రాంతి నాటికి వైఎస్
*పాపం ..ఉత్తం కుమార్ రెడ్డి..అప్రతిష్టేనా
*ప్రతిపక్షం పనిలేక విమర్శలు-విష్ణురాజు
*శ్రీశైలం,సాగర్- కేంద్రం కీలక నిర్ణయం
*ఈసారి 39 కోట్ల మొక్కలు నాటుదాం
*ఎల్.ఇ.డి.బల్లులతో 48 కోట్ల ఆదా
*చంద్రబాబు నాయీ బ్రాహ్మణులతో చేయి కలపరా
*కేంద్రంతో కెసిఆర్ లాలూచీ-టిడిపి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info