A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ చలవ వల్లే చంద్రబాబు మంత్రి అయ్యారు
Share |
September 19 2018, 11:54 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విపక్ష నేత జగన్ వ్యంగ్యాస్థ్రాలు సంధిస్తూ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంలో చంద్రబాబు మొదటిసారి ప్రాతినిద్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుతున్నారు.అలాగే చంద్రబాబు మొదటిసారి మంత్రి అయింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే అని గుర్తు చేస్తున్నారు.
‘చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. ఆశ్చర్యం ఏంటో తెలుసా. 1978లో ఇదే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చలవతో మంత్రి కూడా అయ్యాడు.మంత్రి అయి ఐదేళ్లు పరిపాలన చేశాడు. మళ్లీ 1983లో ఎన్నికలు జరిగాయి. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదే చంద్రగిరి నుంచి బరిలోకి దిగితే 17,500 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. ఇదే చంద్రగిరి నియోజకవర్గాన్ని చూడండి. సొంతవూరికి ఏదైనా చేయాలని కాస్తోకూస్తో గొప్పగా సెటిల్‌ అయిన ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా సొంత గడ్డకు ఏదైనా చేయాలని తపన పడతారు. డబ్బు పంపించి అభివృద్ధికి పాటుపడతారు.అలాంటిది 13 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు సొంతవూరు ఉండాల్సిన స్థితి ఇదా?. చిన్నవయసులో చంద్రబాబు నారావారిపల్లె పక్కన ఉన్న శేషాపురం స్కూల్‌లో చదువుకున్నారు. ఇవాళ్టికి కూడా ఈ స్కూల్‌కు పిల్లలు వెళ్తున్నారు. గట్టిగా తుమ్మితే పడిపోయే దుస్థితిలో పాఠశాల ఉంది. ముఖ్యమంత్రి చదువుకున్న స్కూల్‌ పరిస్థితి ఇలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా స్కూళ్ల పరిస్థితి ఏంటి? అని జగన్ ప్రశ్నించారు.

tags : jagan, chandrababu

Latest News
*కన్నా మంచి ప్రశ్నే వేశారు..కాని రిప్లై వస్తుందా
*బిజెపి కొంప ముంచిన విష్ణుకుమార్ రాజు
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*సోమయాజులు నివేదిక- జగన్ స్పందన
*మాజీ ప్రదాని పై కేసు కొట్టివేత
*కేంద్రంపై ఎపి అసెంబ్లీ తీర్మానం
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info